సర్వ మానవాళికి ఖుర్ఆన్ మార్గదర్శకం

కెరియర్ స్కిల్స్
August 29, 2021
ఒక్క గంట
August 29, 2021

ఎస్.ఐ.ఓ తెలంగాణ తరపున పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని దావా ఇఫ్తార్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రంజాన్ నెల ప్రాముఖ్యత, ఉపవాసాల ముఖ్యోద్దేశం, దివ్యఖురాన్ పరిచయం లాంటి కార్యక్రమాలు ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి, ఇచ్చోడ, ఆదిలాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో జరిగాయి. రంజాన్ మాసంలో ఖుర్ఆన్ అవతరించిందని, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్న ఈ గ్రంథం సమస్త మానవాళికి బుజుమార్గం చూపడానికి దైవం తరపున పంపబడిందని, ఇందులో పేర్కొన్న ఆదేశాలను పాటిస్తూ జీవనం గడిపే వారికే ఇహ, పరలోకాలలో సాఫల్యం లభిస్తుందని, వక్తలు పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ రోనాల్డో రోస్ గారిని కలిసి దివ్యఖుర్ఆన్ బహుకరించటం జరిగింది. దీనితో పాటు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ సందేశం, బదర్ సంగ్రామం, మక్కా విజయం లాంటి విషయాలపై వివిధ ప్రాంతాలలో నిర్వహించిన కార్యక్రమాలలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *