విద్యార్థులే నవ సమాజ మార్గనిర్దేశకులు

కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం
August 28, 2021
ముళ్ళబాటలో….
August 29, 2021

“ఆధునిక యుగం విద్యార్థులను చెదులకు బానిసగా మారుస్తోంది. మంచిని ఇష్టపడకుండా చెడులను ఆనందించేలా చేస్తోంది. దీంతో విద్యార్థిలోకం ఉన్నత ఆలోచనల వైపు అడుగులు వేయలేకపోతోంది. నిత్యం చెదుల్లో లీననువుతూ భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గత మూడు దశాబ్దాలకు పైగా విలువలనే లక్ష్యంగా ఎంచుకుని ఎస్ఎస్ఐఒ విద్యార్థులను మంచి వైపునకు మరుల్చుతోంది. దేశవ్యాప్తంగా ఎన్నో నైతిక ఉ ద్యమాలు చేపట్టి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని నిర్మిస్తోంది. ఎస్ఐఓ ద్వారానే విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతంగా మారుతుంది”

ఎస్ఐఒ జాతీయ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్

ఇటీవలె గోవాలో జరిగిన సలహా మండళ్ల సమావేశంలో నూతనంగా ఎస్ఐఓ జాతీయ అధ్యక్షులుగా ఆయన ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విజయపతాక ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

ప్రశ్న: మీ విద్యాభ్యాస నేపథ్యం, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాతో మీకు పరిచయం ఎలా ఏర్ప డింది?

జ: ఆదిలాబాద్ జిల్లా భైంసాలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే నాజిరాతజ్వీదుల్ ఖుర్ఆన్ పేరుగల మదర్సాలో ఇస్లామీ విద్యాబోధన చేశాను. తద్వారా నాకు ధర్మజ్ఞాన సముపార్జన వైపు అభిరుచి కలిగింది. ఈ క్రమంలో గ్రంథాలయం ‘దారుల్ ముస్తాఫా అల్ ఫుర్ఖాన్’ను ఏర్పాటు చేయడం, క్రమక్రమంగా పుస్త కాలను చదవనారంభించాను. గ్రంథాలయానికి తరచుగా జమాఅతె ఇస్లామీ హింద్ సభ్యులు వస్తుండేవారు. వారితో ఏర్పడిన పరిచయం, సంభాషణల ద్వారా తెలుసుకున్న విషయాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. జనాబ్ అబ్దుల్ లతీఫ్ ఇస్మాయీల్గా గారితో ధర్మజ్ఞాన చర్చలు చేస్తుండేవాణ్ని. ఇవే నన్ను ఎస్ ఐ ఓ లో చేరేలా చేశాయి.

ప్రశ్న: సంస్థ అధ్యక్ష బాధ్యతను మీరు ఎలా భావిస్తున్నారు?

జ: బాధ్యత అనేది జవాబుదారీతనాన్ని రెట్టింపు చేస్తుంది. ఒకరకంగా ఇది దైవం తరపున పరీక్షగా భావిస్తున్నాను. దైవం నాకు ఈ బాధ్యత కల్పించడం, ఈ మార్గంలో స్థిరచిత్తంతో శాయశక్తులా కృషి చేసే జ్ఞానాన్ని ప్రసాదించాల్సిందిగా వేడుకుంటున్నాను.

ప్రశ్న: విద్యా ప్రైవేటీకరణ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

జ: ప్రస్తుత విద్యావిధానం మరియు దానికనుగుణంగా వస్తున్న మార్పులు ఆందోళనకరంగా ఉన్నాయి. విద్య కేవలం పెట్టుబడిదారులు, బడా వ్యాపారుల కబంద హస్తాల్లో చిక్కుకుంటోంది. పాఠశాలలు, కళాశాలలో వసతుల లేమి, ఇంజనీరింగ్ కళాశాలలో తగిన సదుపాయాలు లేక చాలా కళాశాలలు ఇటీవల మూత పడడమే దీనికి నిదర్శనం. ప్రైవేటీకరణ విద్యను మార్కెట్ సరుకుగా, విద్యార్థులను యంత్రాలుగా మారుస్తున్నాయి. ఇలాంటి తీవ్ర ఆందోళన నుండి విద్యను కాపాడవలసిన, రక్షించవలసిన బాధ్యత నేటి విద్యార్థులపై ఎంతో ఉంది.

 ప్రశ్న: ఇటీవల సుప్రీంకోర్టు ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని వివరణ ఇచ్చింది. వీటిపై మీ స్పందన?

జ: ప్రపంచంలో ఉన్నతమైన జీవి మానవుడు, మరి మానవుని ప్రాణానికి అత్యంత విలువ ఉంది. ప్రపంచ దేశాల్లో ఉన్న చట్టాల్లో ప్రాథమికంగా జీవించే హక్కు కల్పించడం జరిగింది. సమాజంలో ముఖ్యంగా విద్యార్థిలోకం దీన్ని గుర్తించాలి. ఆత్మహత్య చేసుకోవడం వల్ల సమ స్యలు పరిష్కారం కావు. ఇది భయానక నేరం. ప్రభుత్వాలు చట్టాల పట్ల బాధ్యతగా వ్యవహరించి వాటిని చిత్తశుద్ధితో అమలుచేయడం ముఖ్యం.

ప్రశ్న: ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటనా స్వేచ్ఛపై మీ అభిప్రాయం?

జ: ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటనా (మాట్లాడే) స్వేచ్ఛ ప్రధానమైంది. తన భావాలను తెలియజేసే స్వాతంత్య్రం అందరికీ ఉంది. కాని నేడు దానికి వ్యతిరేకంగా ప్రకటనలు రావడం విచ్ఛిన్నకర శక్తుల ప్రభావం పెంచేలా ఉంది. విద్యార్థులు దీన్ని గమనించాలి. వారు సామాజిక సమస్యలపట్ల లోతైన అవగాహన కలిగుండాలి. వారే నేడు సమాజాన్ని అభివృద్ధి వైపు తీసుకురావలసిన ప్రధాన సాధనలు. విచ్ఛిన్న శక్తులు విద్యార్థులను కీలుబొమ్మలుగా చేసుకుని సమాజాన్ని మతపరంగా చీల్చేలా అడుగులేస్తున్నాయి. సత్యాసత్యాలను తెలుసుకుని మేథస్సును ఉపయోగించి ఉన్నత సమాజ నిర్మాణానికై విద్యార్థులు పాటుపడాలి.

ప్రశ్న: పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి విషయాల్లో విద్యార్థుల పాత్రపై మీ అభిప్రాయం

జ: మానవత్వం, సమైక్యత, సమా జంలో జ్ఞానాన్ని ప్రసరింపజేసే విలువైన సాధనాలు విద్య, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు. కాని నేడు విద్యాలయాల్లో కుల, మత, వర్ణ విభేదాల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యార్థులు విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి అంశాలపై మాట్లాడాలి. విచ్ఛిన్నాన్ని ప్రోత్సహించే శక్తులు, వాటి ప్రభావాన్ని విద్యార్థి లోకం కూకటి వేళ్లతో పెకిలించాలి. చరిత్ర, సంస్కృతి సత్యాలను చెరపడానికి తీవ్ర ప్రయత్న జరుగుతుంది. తద్వారా సమాజంలో అసత్యాలను ప్రజల ముందు తీసుకొస్తూ, ప్రజాస్వామ్య వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా పాలకపార్టీ ముందు కెళ్తుంది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి సంస్థలు, విద్యార్థులు కలసి ఉద్యమిం చాలి.

ప్రశ్న: విద్యార్థుల, మేథావుల ఆలోచ నల్లో వస్తున్న మార్పును ఏ దృష్టికోణంలో మీరు చేస్తారు?

జ: నేడు భారత దేశంలో నైపుణ్యాలకు, సామర్థ్యాలకు కొదవలేదు. విద్యా జ్ఞానాన్ని సముపార్జించడంలో విద్యార్థులు చాలా కృషి చేస్తున్నారు. దీనికి రెండో కోణంలో మేధావులు, విద్యార్థుల ఆలోచ నల్లో వస్తున్న మార్పులు, దృక్పథాలు నేడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సమాజంలో ఉండే పరిస్థితులకనుగుణంగా విద్యార్థులు తమ ఆలోచనలను మార్చుకుంటున్నారు. మరోవైపు సమాజం ఈ విధంగానే ఉంటుంది, తమవల్ల ఏమీ కాదు అనే నిరాశ ధోరణి తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఆలోచనలు సమాజాన్ని విచ్ఛిన్నం వైపునకు లేక సరైన దిశా దశా లేకుండా ప్రయాణాన్ని కొనసాగించేలాచేస్తాయి. దానికి భిన్నంగా మధ్యే మార్గాన్ని విద్యార్థులు అనుసరించి, నిర్మాణాత్మక మైన వైఖరి అవలంబించాలి. ఈ దృక్పథాన్నే ఎస్ఐఒ విద్యాలయాల్లో పెంపొంది స్తోంది. అనేక కార్యక్రమాల ద్వారా వారిలో చైతన్యం తీసుకొస్తోంది.

ప్రశ్న: విశ్వవిద్యాలయాల్లో ఎస్ఐఒతో ఎలాంటి ఆక్టివిజము తీసుకురావాలను కుంటున్నారు?

జ: విశ్వవిద్యాలయాల్లో స్టూడెంట్ ఆక్టివిజమ్ను సరైన దిశలో విద్యార్థులను చైతన్యం చేసే విధంగా ఉండాలి. వారిలో పాజిటివ్ యాటిట్యూడ్ (సకారాత్మక భావాలను), సమానత్వ భావాలు, విలువ లతో కూడిన ఆక్టివిజమ్ను పెంపొందించ డానికి ఎఒ కృషి చేస్తుంది. సమస్యల పట్ల అవగాహన వాటి శాశ్వత పరిష్కారానికి మార్గం చూపుతుంది. విద్యార్థులు హింసా మార్గాన్ని విడనాడి సకారాత్మక ధోరణిని పెంపొందించుకోవాలి. విద్యాలయాలు ప్రయోగశాలలు కాబట్టి విద్యార్థులలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. ఎస్ఐఒ కృషి వల్ల కేరళలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు సమైక్యతా సోదరా భావాన్ని పెంపొందించుకుని రాజకీయ, విచ్ఛిన్న శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మార కూడదు. విద్యా విధానంలో నూతన ఆవిష్కరణలను తీసుకురావలసిన అవసరం ఉంది.

ప్రశ్న: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ఎన్నికల నిర్వహణపై ఎస్ఐఒ పాత్ర ఏమిటి?

జ: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు విద్యార్థి ఎన్నికల నిర్వహణ, వాటి సాను కూల విషయాలను ప్రభుత్వాలు గుర్తిం చాలి. తద్వారా విద్యాలయాల్లోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. సామాజిక విలువలు, ప్రజాస్వామ్య విలువ లను పెంపొందిస్తూ విద్యార్థి సమస్యలను నిరంతరం పరిష్కరించే వ్యవస్థ అవసరం. ప్రశ్న: విద్యార్థులకు మీరిచ్చే సందేశం?

జ: విద్యార్థులు మార్పును కోరుకునే, చైతన్యాన్ని, పోరాట పటిమను కనబరిచే శక్తిగలవారు. విద్యార్థులు, యువకులు దేశానికి పట్టుకొమ్మలు వంటి వారు. రాబోయే తరానికి మార్గ నిర్దేశకులు. సంక్షిప్తంగా చెప్పాలంటే సామాజిక మార్పులో విద్యార్థుల పాత్ర కీలకం. నేడు అనేక సమస్యలతో నమాజం ఇబ్బందులకు గురవుతుంది. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ సామాజిక నిర్మాణానికి అహర్నిశలు కృషి చేయాలి. విద్య ద్వారా కేవలం యాంత్రిక జీవనం సాగిస్తూ సంపాదనే ధ్యేయం కాకూడదు. సమాజాన్ని సరియైన దిశలో నడపాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంది. 

ప్రశ్న: సంస్థ సంబంధీకులతో….

జ: సంస్థ శ్రేణులు తమను తాము అనునిత్వం కొత్తగా ఆవిష్కరిస్తూ సమాజం పట్ల వారి బాధ్యతను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. సమాజంలో ఉండే సమస్య లను అర్థం చేసుకుంటూ పరిష్కార మార్గాలను అన్వేషించాలి. ప్రస్తుత దేశ పరిస్థితుల ద్వారా నిరాశ చెందకుండా మధ్యేమార్గాన్ని ఎన్నుకుంటూ ప్రభావం చూపాల్సిన అవసరం ఉంది. సంస్థ బాధ్యతలు తమ వ్యక్తిగత జీవితాలను నిర్మించు కుంటూనే సంస్థ పనిని ప్రభావవంతం చేయాలి. సమయం మరియు సమాజంపై దృష్టి కేంద్రీకరిస్తూ, నైపుణ్యాలను ఉపయోగించి సమస్యల పరిష్కారానికి అహర్నిశలు పాటుపడాలి. సమాజం పునర్నిర్మాణంలో తమ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వర్తించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *