ముళ్ళబాటలో….

విద్యార్థులే నవ సమాజ మార్గనిర్దేశకులు
August 29, 2021
భావి భారత పౌరుగ్లను తీర్చిదిద్దే టీచింగ్
August 29, 2021

(“హాస్టల్ బాత్రూమ్ లో పదవతరగతి విద్యార్థిని ప్రసవం” అన్న వార్తను చదివాక)

స్కూల్ ఫైనల్ వయసులోనే

ప్రేమించుకోవడాలు, ఐక్యమవడాలు

అవసరమా చెల్లీ!

ఊహల పల్లకీలో ఊరేగే వయసే 

కాని, చేదు వాస్తవాల ముళ్ళబాటలో

అడుగుపెట్టకూడదు కదా! 

అంబరాన్నంటే సంబరంతో 

ఆనందంగా, తోటి పిల్లలతో 

తిరుగాడాల్సిన సమయాల్లో 

స్వెట్టర్తో పొట్టను కప్పుకొని 

ఒంటరి దిగులు ద్వీపంలా మారి 

ఎందుకు కుమిలిపోవలసి వచ్చింది? 

మూడు నిమిషాల ముచ్చట

నిన్ను ముప్పుతిప్పలు పెడుతుందని 

గ్రహించకుంటే ఎలా?

ముందుచూపుతో మసలుకోవాలి కదమ్మా! 

చదువుల ఒడిలో జ్ఞాన సర్వతిలా 

వెలుగొందాల్సిన క్షణాలు 

కడుపులోని శిశువు తన్నులతో 

ఎందుకు ఆవిరైపొయ్యాయి? 

వరమై ఆహ్లాదపరచాల్సిన మాతృత్వం 

శాపమై నిన్నెందుకు బాధించింది? 

బాత్రూమ్లో బిడ్డను కనే దుస్థితి 

ధృగ్గోచరం కానందుకే కదా? 

పొత్తిళ్ళతో హత్తుకోవాల్సిన బిడ్డను 

ముళ్ళకంప పైకి విసిరి వెయ్యాల్సి రావటం 

ఎంత దుర్భరం! 

ప్రలోభ పెట్టే మగవాడు 

ఎప్పుడూ మీకు పగవాడే

జాగ్రత్తే మీ ఆయుధం చెల్లీ 

విజ్ఞతతో మసలుకోవాలి తల్లీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *