మారుతున్న ప్రజాస్వామ్య ముఖచిత్రం

ఎస్ఐ.ఓ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం
August 29, 2021
మాదకద్రవ్యాలు జీవన వినాశకాలు
August 29, 2021

ఈ మధ్యకాలంలో పార్లమెంటులో వాడివేడిగా చర్చ జరుగుతున్న మతమార్పిడి. ఈ అంశాన్ని సంఘపరివార్ మళ్లీ తెరపైకి తెచ్చింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అరెస్సెస్, దాని అనుబంధ సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అవి ఒక పథకం ప్రకారమే దేశంలో మత తత్వ అజెండాను ఉధృతం చేస్తున్నాయి. లవ్ జిహాద్, సంస్కృత భాషకు ప్రాధాన్యం, చరిత్ర పుస్తకాల్లో మార్పులు, భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాల నడం, బలవంతపు మత మార్పిడులు, గాంధీని చంపిన గాడ్సేను కీర్తించడం. ఇలా రకరకాల రూపాల్లో ఆరెస్సెస్, బిజెపిలు తమ ఫాసిస్టు అజెండాను ముందుకు తెస్తోంది. దీంతో దేశ సమైక్యత, సమగ్రతను లౌకిత చట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నాయి. మతమార్పి డుల కోసం సంఘ్ పరివార్ ప్రత్యేకంగా ఒక పథకాన్నే రూపొందించింది. ‘గర్ వాపనే’ (ఇంటికి తిరిగి రండి) అన్న నినా దంతో సంఘపరివార్, దాని అనుబంధ సంఘాలు దేశంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. వ్యక్తిగత వ్యవహారంలో రాజ్యాంగం జోక్యం చేసుకోదు. ప్రతి ఒక్కరికి భావప్రకటన స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత విషయాలకు ఎవరికి వారికి ఉంటాయి. ఎవరైనా స్వేచ్ఛగా తనకు నచ్చిన మతంలోకి వెళ్లవచ్చు. లేదా తిరిగి రావచ్చు. కానీ సంఘపరివార్, అరెస్సెస్, దాని అనుబంధ సంఘాలు మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య దేశంలో అలజడులు సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో టివి-9 ఛానల్లో వచ్చిన ఓ సంఘపరివార్ నేత తాము 70 సంవత్సరాలుగా దీని కోసమే (బిజెపి, సంఘపరివార్, అరెస్సెస్ శక్తులు అధికారంలోకి రావడం) ఎదురు చూశా మని, లేకలేక 70 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వస్తే ఎలా వదులుకుంటా మని చెప్పారు. ఢిల్లీలో కూడా సంఘ్ పరివార్ జాతీయ నాయకులు కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. దీని బట్టి చూస్తే వారు ప్రణాళిక, కార్యచరణ ఎమిటో అర్థమవుతుంది.

ముస్లింలు, క్రైస్తవుల్లో పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక్కో మతానికి ఒక్కో రేటు నిర్ణయిస్తూ దానిని పక్కాగా అమలు చేస్తున్నాయి. యుపి, బీహార్, బెంగాల్‌కు చెందిన పేద ముస్లింలను ఆదరిస్తున్నట్టు నమ్మించి, బెదిరించి నగదు, రేషన్‌కార్డు లను ఎరగా చూపి సుమారు 300 మందిని హిందూమతంలోకి బలవంతంగా చేర్చుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాపూర్లో ముస్లిములతో పాటు క్రైస్తవులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా మతమార్పిడి గావించడానికి సంఘ్ శక్తులు వేసిన పథకం ఆధారాలతో సహా మీడియాకు లభ్య మైంది. ఒక పేద ముస్లిం మతం మారితే రూ.5 లక్షలు, క్రైస్తవుడు మతం మారితే రూ.2 లక్షలు ఇస్తామని ఆశ చూపి మత మార్పిడులకు పాల్పడడం సంఘపరివార్ దౌష్యానికి దర్పణం, అలీగఢ్‌లోనూ ఇదే పథకాన్ని అమలు చేసింది. తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా దీనికి వ్యాపింపజేయాలని చూస్తోంది. గతంలో హిందూవులు ఎక్కడైన స్వచ్ఛందంగా ఇతర మతాల్లోకి మారితే వాటిని బలవంతపు మత మార్పిడులంటూ నానా హంగామా చేసిన ఆరెస్సెస్, బిజెపిలు ఇప్పుడు తామే ఆ పనికి తెగబడడం వాటి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోంది. ఈ మత మార్పిడుల గురించి ప్రశ్నిస్తే మొత్తంగానే మత మార్పిడులపై నిషేధం పెడదామా అని ఎకసెక్కాలాడుతోంది.

రాజ్యంగంపై ప్రమాణం చేసిన మంత్రులే ఈ విధంగా బాధ్యతా రాహితంగా వ్యవహరిస్తుంటే దేశ సమైక్యత, సమగ్రతకు మూలమైన లౌకిక వ్యవస్థను కాపాడేదెవరు. ప్రత్యేకంగా ఒక మతానికి చెందిన వారిని బలవంతంగా ఇతర మతంలోకి మార్పిడిని చేసే చర్యను నేరంగా పరిగణించి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మత విదేష్వాలను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తే వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలి. కానీ మోడీ ప్రభుత్వం నుంచి ఇలాంటి చర్యలు ఆశించడం పగటి కలే. దేశ సమైక్యతను మంటగలపాలని చూస్తున్న కాసాయ శక్తులకు ఆయన అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఈ విషయంపై ఆయన మౌనమే వేయి గొంతులతో వెల్లడి స్తోంది. సంఘపరివార్ దౌష్ట్యాలను ఎదు ర్కొవడం నేడు దేశ ప్రజల ముందున్న పెద్ద సవాలు.

మరికొన్ని విషయాలను గమనిస్తే…

రాముడు ఉత్తముడు, పురాణాలను, ఇతిహాసాలను పాఠ్యాంశాలుగా పెట్టాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరాని వ్యాఖ్యానించారు. ముస్లిములు, క్రైస్తవులు రాముని బిడ్డలేనని కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఒక సభలో చెప్పారు. మోడీని వ్యతిరేకించే వారంతా పాకిస్తానియులేనని మరో ఎంపీ గిరిరాజ్‌సింగ్ చెప్పారు. అంటే బిజెపి కాని వారంతా పాకిస్తానీయులేనా..? గాయత్రి మంత్రాన్ని పార్లమెంటులో ప్రార్థనా గీతంగా పెట్టాలని ఒక కేంద్ర మంత్రి ఆకాక్షించారు. భగవద్గీతను జాతీయ గ్రంథంలా ప్రకటించాలని కేంద్ర మంత్రి సుస్మాస్వరాజ్ చెప్పారు. యోగ, ధ్యానాలను విశ్వ విద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని మరో కేంద్ర మంత్రి అన్నారు. హిందువుల మంచి గురించి ఎవరైతే మాట్లాడగలరో వారే ఈ దేశంలో రాజ్య మేలుతారు అని నూతన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చెప్పారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఒక బిజెపి కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ బిజెపి వాళ్లు రాముని సంతానం, మిగిలిన వాళ్లంతా అక్రమ సంతానం అని చెప్పడం చూస్తే ఈ శక్తులు ఎంత బరిగెలిస్తు న్నాయో అర్థమవుతోంది. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడుచు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత మతతత్వపు అనుభవాలను చూస్తే…

1992 డిసెంబరు 6వ తేదీన బిజెపి, దాని అనుబంధ కాషాయ కూటమి అయోధ్యలోని బాబ్రీ మసీదును అతి క్రూరంగా కూల్చివేసింది. ఈ విధ్వంసం జరిగి ఇప్పటికి 22 సంవత్సరాలు గడి చింది. స్వాతంత్య్రం వచ్చిన తీరు. ఆనాడు హిందూ, ముస్లింల మధ్య జరిగిన తీవ్ర మైన మత వైషమ్యాలతో కూడిన మారణ కాంకడను గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. పది లక్షలకు పైగా ఊచకోతకు గుర య్యారు. దీనిపై గాంధీజీ ఆమరణ దీక్షకు ఉపక్రమించారు. హిందూ, ముస్లిముల ఐక్యత కోసం పోరాడారు. ఆ సమయం లోనే హిందూ మతోన్మాద శక్తులు ఆయన్ను పొట్టనబెట్టుకున్నారు. ఆ సమయంలోనే 1949 డిసెంబరు 22, 23వ తేదీల్లో సీతారాముల విగ్రహాలను దొంగతనంగా బాబ్రీ మసీదులోకి దూరి ప్రతిస్టించారు. ఆ సమయంలో ప్రభుత్వం దీన్ని నివారించాల్సింది పోయి వివాదస్పద స్థలంగా ప్రకటించి తాళాలు వేయించారు. 19926 కాషాయ కూటమి శక్తులు మసీదును కూల్చివేశాయి. 2002లో గుజరాత్ లో ముస్లిములపై జరిగిన మారణకాండలో 2,000 మందికి పైగా దారుణంగా ఊచకోతకు గురయ్యారు. ఆ కాలంలో ముజఫరనగర్, షహరాన్‌పూర్, బుందేల్‌ఖండ్, కర్నాటకలోని బెల్గాం వంటి చోట్ల జరిగిన దాడులు చూస్తే ఈ ధోరణి అర్థమవుతోంది.

సంఘపరివార్, అరెస్సెస్ ప్రణాళిక ఎమిటి..?

సంఘపరివార్, అరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు పథకం ప్రకారమే దేశంలో మతతత్వ అజెండాను ఉధృతం చేస్తున్నాయి. లవిహాద్, సంస్కృత భాషకు ప్రాధాన్యం, చరిత్ర పుస్తకాల్లో మార్పులు, భగవద్గీతను జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలనడం, బలవంతపు మత మార్పిడులు, గాంధీని చంపిన గాడ్సేను కీర్తించడం, పైగా దేశంలో గాంధీని చంపిన గాడ్సే విగ్రహాలను ప్రతిష్టిస్తామని కూడా ప్రకటించారు. ఇది మరింత దారుణం. ఇలా. ఆరెస్సెస్, బిజెపిలు రకరకాల రూపాల్లో తమ ఫాసిస్టు అజెండాను ముందుకు తెస్తోంది. దీంతో దేశ సమైక్యత, సమగ్రతలను, లౌకిత చట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నాయి. మతమార్పిడుల కోసం సంఘ్ పరివార్ ప్రత్యేకంగా ఒక పథకాన్నే రూపొం దించింది. లేకలేక 70 సంవత్సరాల తర్వాత వచ్చిన అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుని దేశంలో తమ ఫాసిస్టు, మతతత్వ అజెండాలను తీసుకెళ్లి ప్రజల్లో చీలీకలు తీసుకురావడమే వీరి ప్రధాన ఉద్దేశ్యం. ప్రేమికుల రోజును వ్యతిరేకించే ఈ శక్తులు వ్యవహారం భవిష్యత్తులో ఎలా ఉంటుందో. ఇప్పటివరకు ఒక్కడైన ప్రేమి కుల రోజులన ప్రేమికులు కన్పిస్తే అక్కడే పెళ్లి చేయడం మనం చూస్తున్నాం. రానున్న ప్రేమికుల దినం రోజు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నాయి. వాటిని ఈకథనంలో వెల్లడిస్తే బాగుండదు. భవిష్య త్తులోనే వారి ఆగడాలను చూడాలి.

అసలైన సమస్యలను పక్కదారి పట్టించి మతతత్వ భావాలను పెంపొందించేందుకు చేస్తున్న కొన్ని శక్తుల ప్రలోభాలకు గురికాకుడదు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నల్లధనం దేశానికి తెప్పిస్తానని చెప్పారు. యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని నమ్మబలికారు. ప్రస్తుతం మతమార్పిడి, ఇతర మత అంశాలను ఇష్యూ చేస్తూ అసలైన సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ఆరున్నర నెలల కాలం సంఘపరివార్ సంస్థలు, అరెస్సెస్ దాని అనుబంధ సంఘాలు, బిజెపి ప్రభుత్వ విధానాలు ఇంత ఘోరంగా, క్రూరంగా ఉంటే ఇంకా మిగిలిన నాలుగున్నర సంవత్సర కాలంలో ఇతర మతాల వారికి స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ ఉంటుందా..?

భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు.. 

పౌరుల ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వేచ్ఛను కూడా మత తత్వపు సంఘాలు హరిస్తున్నాయి. ముంబయి నగరంలో ఇద్దరు యువతు లను 66 (ఎ) సెక్షన్ కింద అరెస్టు చేశారు. వారు చేసిన నేరం ఫేస్బుక్ లో తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించడమే. దీనంతటి వెనుక కొంద రాజకయీ పర మైన, మతపరమైన భావోద్వేగ అంశాలు ఉన్నాయి. 2012 నవంబరు 17వ తేదీన శివసేన అధినేత బాల్ థాకరే మరణవార్త వినగానే చాలామంది ఆయన మరణ పట్ల గౌరవసూచకంగా దుకాణాలు మూసి వేశారు. బంద్ పాటింకపోతే శివసేన ఆగ్రహానికి గురవుతామనే భయంతో దుకా ణాలు కట్టేసిన వారు కూడా న్నారు. దీన్ని చూసిన 21 ఏళ్ల షహీన్ ధదా ఫేస్ బుక్‌లో ఒక వ్యాఖ్య చేసింది. థాకరే వంటి వారు రోజు పుడుతూ ఉంటారు, గిడుతూంటారు. దాని కోసం నగరమంతా బంద్ చేయడం అవసరమా అని ఫేస్బుక్లో వ్యాఖ్యానించారు. షహీన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ ఆమె స్నేహితురాలు 20 సంవత్సరాలు ఉన్న రీనూ శ్రీనివాసన్ కూడా ఫేస్బుక్లో లైక్ అని కొట్టారు. దీన్ని చూసిన ఓ స్థానిక శివసేన కార్యకర్త పిర్యాదు మేరకు 19వ తేదీన అర్ధరాత్రి యువతుల్నిద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తడం, అనంతరం బెయిల్‌పై విడుదల అవడం జరిగాయి. మతాన్ని చాందస వాదంగా మార్చుకుని, ప్రజాస్వామ్య విలువలను, భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న వీరు దేశంలో అధికారంలోకి వస్తే ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.

యువత మేల్కొవాలి.. మతతత్వాని తిప్పికొట్టాలి…

దేశభవిష్యత్తు. జాతి భవిష్యత్తు యువత పైనే. దీనికి కారణంగా అమెరికా జనాభాకి సమానంగా మన దేశంలో యువత జనాభా ఉండటమే. దేశ జనాభాలో యువత 60 శాతంపైనే కావడం అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం భారతదేశం. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశప్రగతిలో భాగస్వాములు చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. ప్రస్తుతం దేశ పరిరక్షణ కోసం యువత పాత్ర కీలకం. ప్రజాస్వామ్యం మీద పూర్తి నమ్మకం ఉండాలి. మతతత్వ రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉండాలి. స్వాతంత్రోద్యమంలో యువత పాత్ర కీలకమైంది. ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన ఎందరో యువత పరిస్థితులను ఎదురొడ్డి పోరాడారు. ప్రాణాలు కోల్పోయారు. దేశ పరిరక్షణ కోసం పోరాడారు. నేడు మతతత్వ రాజకీయాలను అర్థం చేసుకోవడం యువతకు అత్యంత ఆవశ్యం. దేశ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం పాటుపడాలి. నేటి యువత సుమారుగా 47 శాతం సోషల్ మీడియాను బాగా వాడుకుం టోంది. దీన్ని గమనించిన మతతత్వ రాజకీయ పార్టీలు సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తు న్నాయి. ఇలాంటి వాటికి విసర్జించాల్సిన ఆవశ్యకత యువతపై ఎంతో ఉంది. దేశంలో అవినీతి, అక్రమాలు పెరుగు తున్నాయి. నిర్లక్ష్యరాస్యత, పేదరికం, తీవ్రవాదం, తరగిపోతున్న మానవ విలువలు, విద్యా విలువలు, అవినీతి, అక్రమాలు, కుళ్లుతున్న రాజకీయ వ్యవస్థ ఇలా ఎన్నో సమస్యలు యువత ముందు ఉన్నాయి. వీటిపై పోరాడాలి. అసలైన సమస్యలను పక్కదారి పట్టించి మతతత్వ భావాలను పెంపొందించేందుకు చేస్తున్న కొన్ని శక్తుల ప్రలోభాలకు గురికాకుడదు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నల్లధనం దేశానికి తెప్పిస్తానని చెప్పారు. యువతకు, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని నమ్మ బలికారు. ప్రస్తుతం మతమార్పిడి, ఇతర మత అంశాలను ఇష్యూ చేస్తూ అసలైన సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ఆరున్నర నెలల కాలం సంఘపరివార్ సంస్థలు, అరెస్సెస్ దాని అనుబంధ సంఘాలు, బిజెపి ప్రభుత్వ విధానాలు ఇంత ఘోరంగా, క్రూరంగా ఉంటే ఇంకా మిగిలిన నాలుగున్నర సంవత్సర కాలంలో ఇతర మతాల వారికి స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ ఉంటుందా..? అన్నది నేటి యువతకు కలుగుతున్నప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *