మానవహక్కులు – ఇస్లాం

ఒక్క గంట
August 29, 2021
ఉపవాసాల పరమార్థం
August 29, 2021

ఈనాడు మానవహక్కులు చర్చనీయం శమయ్యాయి. మనిషి నివసించే సమాజం, దేశం, ప్రపంచంలో అతని హక్కు ఏమిటి? యజమాని హక్కుఏమిటి? కూలీవాని హక్కు ఏమిటి? దేశపౌరుని హక్కు ఏమిటి? దేశం విడిచి విదేశాలలో ఉన్నవారి హక్కు ఏమిటి? వీటన్నింటిలో అతనికి సమానహక్కు లభించాలా? అయితే వీరందరి మధ్య భేదం ఉంది ఎవరికైతే శక్తి ఉందో అతడు తనకు చాలా హక్కులు కావాలంటాడు .మరోవైపు బలహీనుని హక్కులను అంగీకరించడం జరుగదు, ఒక వేళ అంగీకరించినా ఆ హక్కులు మాత్రం అతనికి దక్కవు.

జన్మించే ప్రతి శిశువుకు జేవించేహక్కు ఉంది. ఆ శిశువును అంతంచేసే హక్కు ఎవరికీలేదు అంతే కాదు భూమి మీద ఉండే ఏమనిషి జీవితాన్ని కూడా హతమార్చేహక్కు ఎవరికీ లేదు. జీవించి ఉంటే సమాజంలో అతనికి కొన్ని హక్కులు ఒనగూడుతాయి. పుట్టిన ప్రతి శిశువు జీవించడానికి కావలసిన వనరులు అతనికి లభించాలి. ఆహారం అవసరం గనుక ఆహారం లభించాలి. అతను తల్లిగర్భంలో ఉన్నప్పుడు అల్లాహ్ యే ఆహారం అందించాడు. ఇక ఇప్పుడు అతడు మీపరం చేయబడ్డాడు కనుక అతని అవనరాలు నేను తీర్చగలుగుతున్నానా లేదా అని మీరు సమీక్షించుకోవాలి. అతను సజీవంగా ఉండాలి గనుక సంరక్షణ కోసం తల్లిని సిద్ధంచేయడం జరిగింది. తండ్రి అతని అవసరాలు తీర్చాలని చెప్పబడింది.

మొదటి క్షణం నుండే అతని అవసరాలేమిటో అవి తప్పక అతనికి లభించాలి. అతని ఆహారం, అతని దుస్తులు, అతను నివసించడానికి తగిన ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది. అతనిని సురక్షిత ప్రాంతంలో ఉంచాలి. చలి, వేడిమిల నుండి అతనిని రక్షించాలి అప్పుడే అతడు నజీవంగా ఉండగలుగుతాడు. విద్య నభ్యసింప జేయడం అతని సహజహక్కు. లేకపోతే విద్యలేనివాడు వింత పశువులా జీవిస్తాడు. ‘ప్రతిమనిషికి విద్య ప్రాప్తం కావాలి. అతను ఉండే పరిసరాలలో మంచి ప్రవర్తనతో మెలిగేలా శిక్షణగరపాలి. ఒక వేళ ఆపిల్లవాడు మన ఏమరుపాటువల్ల మంచి స్థాయికి చేరకపోతే అది మన తప్పే . అవుతుంది. పశ్చిమవిద్యా బోధనకు దశదిశలు ఉండవు. వారిని గనుక ప్రశ్నిస్తే మేము ఒక ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దదలిచాము అంటారు. ఆధునిక విద్య ఎందుకు అభ్యసిస్తున్నావని విద్యార్థిని ప్రశ్నిస్తే చాలా మంది (కొందరుతప్ప) ఉపాధికోసం అని సమాధానం ఇస్తారు. అందువల్ల ప్రతీ తల్లి దండ్రులు తమపిల్లలకు ఒక ఆశయం కోసం చదివించాలి. ఏ ఆశయంకోసం జీవిస్తున్నాము అనేవి తెలియజేయాలి. ఇంకా వారికి తెలుపవలసిన విషయం: దేవుడనేవాడు ఒకే ఒక్కడని, ఆయన ప్రవక్తలను పంపించాడని, గ్రంథాన్ని అవతరింపజేశాడని వాటి ద్వారా మనిషికి సన్మార్గం చూపాడని, అందువల్ల వాటి ఆధారంగానే జీవితం గడపాలని తెలియజేసి నట్లయితే అతడు ఉత్తమ పౌరునిగా తయారవుతాడు. మానవ హక్కుల గురించి చర్చించినప్పుడు తెలిసేదేమిటంటే అతను తనకు సేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉండాలని కోరుకోవడం.

ఇందులో ఏదో ఓ జాతిని సంబోధించలేదు. ఓప్రజలారా! వినండి మిమ్మల్ని నేను ఒక స్త్రీ ఒక పురుషుని ద్వారా పుట్టించాను. మీరు పరస్పరం సోదరులు. ఒకే తల్లి తండ్రుల సంతానం గనుక మీరంతా సమానమే. మీలో ఎలాంటి బేధంలేదు మిమ్మల్ని తెగలుగా, వర్గాలుగా విభజించడం జరిగింది ఎందుకంటే మీరు ఒకరినొకరు గుర్తించుకోవాలని.

“మానవులారా! మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగానూ, తెగలుగానూ చేశాము. వాస్తవానికి మీలో అందరి కంటే ఎక్కువ భయభక్తులుకలవాడే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవ పాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞానం కలవాడు, సకలవిషయాలు తెలిసిన వాడూను. (49:13)

ఉదా॥ ప్రజలందరూ ఒకే రంగు కలిగి ఒకే రూపురేఖలతో, ఒకే ఎత్తులో ఉన్నట్లయితే ఎలా గుర్తించుకునేవారము. వీటిలో వ్యత్యాసం ఉన్నది ఒకరినొకరు గుర్తించుకోవడానికే. ఒకడు ఆఫ్రికావాడు, ఒకడు ఈరాన్ వాడు, ఒకడు భారతీయుడు, ఒకడు పాకిస్తాన్వాడు. అయినా అతడు ఒక వంశానికి చెందినవాడు గనుక హక్కులు అతనికి తప్పనిసరిగా లభించాలి. మనిషి గౌరవానికి నిదర్శనం: అధికారమని, ధనసంపదలని, వంశమని, తెగలని మనిషి ప్రమాణాలు ఏర్పరచుకున్నాడు. కాని, “మనిషి ఒక ఉత్తమ వ్యక్తిగా, ఒక గౌవరనీయునిగా చెప్పుకోవాలంటే అతనిలో దైవభీతి అధికంగా ఉండాలని” దివ్యఖుర్ఆన్ పేర్కొంది.

ఈ విషయంలో మహనీయ ముహమ్మద్ (సఅసం) సెలవిచ్చారు: ఒక అరబ్బుకు అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై ఏలాంటి ఆధిక్యతా లేదు తెల్లవానికి నల్లవానిపై, నల్లవానికి తెల్లవానిపై ఎలాంటి ఆధిక్యత లేదు. అయితే ఎవరిలో భయభీతులున్నాయో (వారే ఆధిక్యం కలవారు). వినండి అందరూ ఆదం సంతానమే ఆదం మట్టితో సృజించబడ్డారు. ప్రపంచంలో ఎవరైనా ఇలా ప్రకటించినట్లు విన్నారా?

రంగుల బేధం మన చేతుల్లోలేదు కాబట్టి రంగులు ప్రమాణం కాదు అని చెప్పబడింది. ఎవరైతే దైవ భీతికలిగి ఉంటారో వారే గౌరవనీయులు. అతనిని గౌర వించవలసిందే. అరబ్బులు అరబ్బేతరులు అందరూ ఆదం సంతానమే.

ఆదం మట్టితో సృష్టించబడ్డాడు మట్టికి గర్వముండదు. అది అణిగి మణిగి ఉంటుంది. దాన్ని తన్నినా అది ఎదురు తిరగదు. దానిని గడ్డపారతో తవ్వినా అది కిమ్మనదు మరి ఆమట్టితోనే నృజింవబడిన మనిషి ఎందుకు గర్విస్తున్నాడు. అధికారంలోనా, రంగులోనా, వంశంలోనా ఏవిషయంలో గర్వం!?

న్యాయవిషయానికి వస్తే, ప్రవక్తలు కేవలం న్యాయం గురించే బోధించారు. న్యాయం కోసం ముస్లిం సమాజాన్ని నిలపడం జరిగింది ఈ ఔన్నత్యం కేవలం ముస్లిం సమజానికే దక్కింది. అల్లాహ్ అంటున్నాడు విశ్వసించినప్రజలారా!

న్యాయధ్వజవాహకులుగా నిలబడండి. (4:135)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *