మాదకద్రవ్యాల మత్తులో యువత

భయపెట్టేస్తున్నారు…
August 29, 2021
జవాబుదారీతనం
August 29, 2021

చదువుకునే వయసులో విద్యకన్నా వ్యవసాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి మాదక ద్రవ్యాల మత్తులో మునిగిపోతూ ఉజ్వల భవిష్యత్తును యువకులు చేతులారా నాశనం చేసుకుంటున్నారు. భావితరాల కోసం ఉత్తమ భవిష్యత్తును అందించాల్సిన యువత వ్యవరాల ఊబిలో కూరుకుపోతూ జీవితాన్ని, జీవాన్ని కోల్పోయి నిర్వేదంగా, నిస్తేజంగా తయారవుతోంది.

మాదక ద్రవ్యాలు. ఇవి దారుణ వ్యసనాలు. వీటికి అలవాటుపడ్డ వారు ప్రాణాలను సయితం బలి తీయడానికి సిద్ధపడుతుంటారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల వేలాది మంది యువకులు తీవ్ర జబ్బులు కొని తెచ్చుకుంటున్నారు. యువకులు ఒకవైపు ధన నష్టం మరోవైపు ప్రాణ నష్టానికి గురవుతున్నారు. దీంతో వారి జీవితాలు అగమ్యగోచరంగా మారి పోతాయి. ఈ వ్యసనం అలవాటుగా మారితే పర్యవసానం ప్రమాదకరంగా ఉంటుందనే విషయం వారు మర్చిపోతున్నారు. తెలిసో తెలియకో, తెలిసిన వారి ప్రోద్బలం వల్లనో ఈ వ్యసనాల వలలో చిక్కుకుంటే భావి జీవితం బాధాకరమవు తుందనే విషయాన్ని వారు తెలుసుకోలేక పోతున్నారు. చదువుకునే వయసులో విద్యకన్నా వ్యసనాలకే ఎక్కువ ప్రాధాన్య మిచ్చి మాదక ద్రవ్యాల మత్తులో మునిగి పోతూ ఉజ్వల భవిష్యత్తును యువకులు చేతులారా నాశనం చేసుకుంటున్నారు. భావితరాల కోసం ఉత్తమ భవిష్యత్తును అందించాల్సిన యువత వ్యసనాల ఊబిలో కూరుకుపోతూ జీవితాన్ని, జీవాన్ని కోల్పోయి నిర్వేదంగా, నిస్తేజంగా తయారవుతోంది. శ్రీలంక, ఫ్రాన్స్, అమెరికా, ఇండియా ఇలా ఏ దేశంలోనైనా డ్రగ్స్క బానిసలైన వ్యధార్థ జీవుల యదార్ధ గాధా చిత్రాలు దయనీయంగా దర్శనమిస్తాయి. ఉత్తమ పౌరులుగా రూపొందాల్సిన యువతను మాదక మత్తులో ముంచెత్తుతూ సమాజానికి భారంగా మారుస్తున్నారు కొందరు స్వార్ధ పరులు. మాదక ద్రవ్యాల పీడనను తుద ముట్టించడానికి జరుపుతున్న ప్రయత్నం అంతంత మాత్రమే.

యువత భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా పరిణమించి దుష్ప్రభావాల ప్రవాహంలో వారిని కొట్టుకుపోయేట్టు చేస్తున్న మాదక ద్రవ్యాల మహమ్మారి ఎలా కబళించి కాటే స్తోందో పరిశీలిస్తే… మన దేశంలో డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో 75 శాతం యవతే నని ఓ పరిశోధనలో వెల్లడయింది. 15 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వారే మాదక ద్రవ్యాల వ్యసనానికి బానిస లవుతున్నారని అంచనా. రాష్ట్రంలోనూ మాదక ద్రవ్యాల వ్యాపారహోరు ఇటీవలి కాలంలో గణనీయమైన పెరిగిపోవటం బాధాకరం. పెద్దలు, యువకు లతోపాటు బాలలు సైతం డ్రగ్స్‌కు బానిసలవుతున్నా రని ఓ సర్వేలో తేలింది. హైదరాబాదు నగరానికి కొంతమంది వ్యాపారులు గంజాయి పండిస్తున్న ప్రదేశాల నుంచి బ్యాగుల్లో, సూట్‌కేసుల్లో అధికారుల కళ్ళుకప్పి ఈ ద్రవ్యాలను తీసుకొస్తున్నారు. చిన్న చిన్న పాలథిన్ కవర్లలో వ్యసనపరు లకు భద్రంగా అందుతున్నాయన్నది బహిరంగ రహస్యం. కొన్ని చోట్ల ఫుట్ పాత్ల డ్రగ్స్ విక్రయ కేంద్రాలుగా మారు తున్నాయి. ఒక్క ప్యాకెట్ ధర పది నుంచి యాభై రూపా యల వరకు ఉంటుందని సమాచారం. గిరాకినిబట్టి వ్యాపారస్తులు చదువుకుంటున్న విద్యార్థుల్లో మానసిక స్థాయి ర్యాన్ని తగ్గించి మాదకద్రవ్యాలకు బానిస చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి కోల్పోతున్నారు. అంతర్జాతీయంగా హైదరాబాద్ మాదక ద్రవ్యాలకు సురక్షిత ప్రాంతంగా మారుతోంది. ఫలితంగా వ్యాపారులు విజృం భిస్తున్నారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల వ్యాపార సంస్థలు అత్యాధునిక సాంకేతిక పరికరాలను, ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగిం చుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. అన్ని హంగులు సమకూర్చుకుంటున్న ఈ డ్రగ్స్ మార్కెట్టు యువతకు చేరువవడంతో అడ్డదారులు తొక్కే వారి సంఖ్య అధికమవుతోంది. దేశంలో కొన్ని చోట్ల బహిరంగంగానే అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని నగరాల్లో విద్యార్థులు డ్రగ్స్ వాడటాన్ని ఓ ఫ్యాషన్‌గా భావిస్తు న్నారు. చిన్న చిన్న దుకాణాల ద్వారా, పాన్ షాపుల ద్వారా “కోడ్” భాషలో వీటి అమ్మ కాలు జోరుగా సాగుతున్నాయని తెలు స్తోంది. ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి విద్యా ర్థులు చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడి నేరగాళ్ళుగా మారుతున్నారనేది దారుణ పరిణామం. విద్యార్థులు డ్రగ్స్ కోసం అనైతిక కార్యకలా పాలకు పాల్పడుతున్నారు.

డ్రగ్స్ వాడకంలో ముందంజలో వున్న ప్రాంతాలను పరిశీలిస్తే దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఢిల్లీలో వేల సంఖ్యలో యువకులు మత్తు పానీయాలలో మునిగి తేలుతున్నారని అంచనా. రెండో స్థానంలో ముంబయి ఉంది. ఇక్కడ హెరాయిన్, మార్ఫిన్, కొకైన్ అనే మత్తు పదార్థాలను ఎక్కువగా వాడుతున్నారన్నది వార్తాకథనం. ఈ నగరంలో వీటి బారిన పడ్డ వారి సంఖ్య సుమారు 90 వేల వరకు ఉండొచ్చని ఇటీవలి సర్వేలో తేలింది. డ్రగ్స్ విని యోగంలో మూడో స్థానంలో వారణాసి ఉంది. తర్వాత స్థానంలో కోల్‌కతా, జబల్పూర్, చంఢీగడ్ వంటి నగరాలలో వ్యాపారులు తమ వ్యాపారాలను మరింత జోరుగా సాగిస్తున్నారని తెలుస్తోంది. ఒక్క ముంబయి నగరంలోనే రోజుకు పది కిలోల డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం. ఏ స్థాయిలో యువత చెడు మార్గంలో పడుతున్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులు కాలేజీలు ఎగ్గొట్టి క్యాంపస్ పరిసరాలలోనే డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ కోసం చావడానికైనా లేదా ఇతరుల ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతున్నా రంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో గమనించొచ్చు. సినిమాలు, టీవీల్లో వచ్చే కథనాల్లో ఈ డ్రగ్స్ వాడకాన్ని చూపించటం వల్ల చిన్న పిల్లలు వీటికి బలైపోతున్నారు. చివరకు డబ్బుకోసం తల్లిదండ్రులను హింసించడం వారితో గొడవపడటం జరుగుతోంది. మాదక ద్రవ్యాల విని యోగం విచ్చల విడిగా జరగడానికి చట్టాలు సరిగ్గా అమలు కాకపోవడం, శిక్షలు పడకపోవడమే కారణం. సింగ పూర్లో డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నా, వాడుతున్నా మరణ శిక్ష విధించే చట్టం ఉంది. కానీ మన దేశంలో మహా అయితే మూడు లేదా ఆరేళ్ళ జైలు శిక్ష లేదా వెయ్యి రూపాయల జరిమాన. అలాం టప్పుడు శిక్షకు భయపడేవాళ్ళు చాలా తక్కువ. ఇంకా కొన్ని సందర్భాలలో అధికారుల అండదండలతో శిక్షా కాలాన్ని తగ్గించుకుని ముందే జైలు నుండి బయటికి రావచ్చు. ఈ శిక్షలు ఇంత సులువుగా వుండడం వల్లనే టీనేజ్‌లో వున్న యువత ఎక్కువగా ఈ డ్రగ్స్ వాడకానికి అలవాటుపడి తమ జీవితా లను సర్వనాశనం చేసుకుంటున్నారు. దేశానికి వెన్నెముక అయిన యువత పెడదారిన పడి బాధ్యత మరచి మాదక ద్రవ్యాలే సర్వస్వంగా భావిస్తూ ఎన్నో అనైతిక మార్గాలకు, అవినీతి పనులకు లోనై తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. దేశ చట్టాలు, శాస నాలు సరిగా లేకపోవడం, ఉన్నా వాటిని కాపాడవలసిన నాయకులు, అధికారుల నిర్లక్ష్యం వహించడం ఎంతో శోచనీయం. కనుక చట్టాలను పటిష్టపరచాలి. అధికారులు, పోలీసులు సమర్థవంతంగా పని చేయాలి. శిక్షలు విధించడంలో అలసత్వం లేకుండా కఠినంగా వ్యవహ రించినట్లయితే యువత కొంత వరకు వీటినుండే బయటపడే అవకాశాలు ఉంటాయి. అలా చేయకపోతే సమాజం మరింత చెడిపోయి కలుషితమయ్యే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *