భావి భారత పౌరుగ్లను తీర్చిదిద్దే టీచింగ్

ముళ్ళబాటలో….
August 29, 2021
భయపెట్టేస్తున్నారు…
August 29, 2021

తల్లిదండ్రుల తర్వాత చిన్నారిపై అత్యధిక ప్రభావాన్ని చూపించేది ఉపాధ్యాయులే. అంతటి గురుతర బాధ్యతలు నిర్వర్తించే ఉపాధ్యాయులకు నేడు ఎనలేని డిమాండ్ ఉంది. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఉపాధ్యాయులను భర్తీ చేస్తుండటంతోపాటు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చిన కార్పొరేట్ విద్యా సంస్థలు టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసిన వారికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. మరో కొద్ది రోజుల్లో డీఎస్సీకి నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ శిక్షణా కోర్సులపై ప్రత్యేక ఫోకస్.. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి మార్గాలెన్నో. పదో తరగతి మొదలుకుని.. డిగ్రీ అర్హతగా పలు విభాగాల్లో ఉపాధ్యా యశిక్షణ కోర్సులు ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఎసిటీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీలుగా కెరీర్ ప్రారంభించవచ్చు.

 మాంటిస్సోరి ట్రైనింగ్

ప్రీ – ప్రైమరీ స్థాయి (3-5 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు)లో బోధించేందుకు ఉద్దేశించిన కోర్సు మాంటిస్సోరి ట్రైనింగ్. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడం, బొమ్మల సహాయంతో వారిలో నైపుణ్యాలను పెంచేందుకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో తర్ఫీదు నివ్వడం ఈ కోర్సు ప్రత్యేకత. ప్రస్తుతం ఐదు దశల్లో ఈ కోర్సు ఉంది. అవి.. సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్స్ సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్(ఎర్లీ చైల్డ్ హుడ్మై డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్స్ హయ్యర్ డిప్లొమా ఇన్ మాంటి స్సోరి ట్రైనింగ్స్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్స్ వీటిలో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి కనీస అర్హత పదో తరగతి. ఆ తర్వాత ఒక్కో దశ శిక్షణ పూర్తి చేసుకుంటూ డిగ్రీతో సమానమైన ప్రొఫెష నల్ డిప్లొమా వరకు చేరుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ కోర్సును పూర్తి చేస్తే అవకాశాలు అపారమనేది నిస్సందేహం. గతంలో నగరాలకు పరిమితమైన ప్లేస్కూల్స్ ఇప్పుడు చిన్న పట్టణాల్లో విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వేలసంఖ్యలో నర్సరీ స్కూళ్లు ఉన్నాయి. ప్రతిభ, అనుభవం ఆధారంగా నెలకు రూ.5-10 వేల వరకు వేతనం అందుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఆంధ్ర మహిళా సభ, మాంటిస్సోరి – హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో సంబంధిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

  డీఈడీ

ఈ కోర్సులో ప్రవేశం కోసం డైట్‌సెట్ రాయాలి. వ్యవధి: రెండేళ్లు. మొదటి ఏడాదిలో.. విద్యామనో విజ్ఞాన శాస్త్రం, విద్యాతత్వ శాస్త్రం, జనరల్ అంశాలైన పూర్వ ప్రాథమిక విద్య-ప్రస్తుత విద్య, ఆరోగ్యం, విద్య- కంప్యూటర్ ఎడ్యుకేషన్, వయోజన విద్య తదితర సబ్జెక్టులు ఉంటారు. రెండో ఏడాదిలో.. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల బోధన పద్ధతులను బోధిస్తారు. కోర్సులో భాగంగా.. టీచింగ్ ప్రాక్టీస్ 75 రోజులు ఉంటుంది. ఇందులో 35 రోజులు ప్రాథమిక పాఠశాలలు, 10 రోజులు ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించాలి. 30 రోజులపాటు పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 23 ప్రభుత్వ “డైట్” కళాశాలలు ఉన్నారు. ప్రతి కళాశాలకు 100 సీట్లు. ప్రైవేట్ సుమారు మూడు వందల కళాశాలల్లో.. దాదాపు 15 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. డీఈడీ ఉత్తీర్ణులు ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష-డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎసీటీ) పోస్టులకు అరులు. 2012 నుంచి ఎసీటీ పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే నిర్ణయం ఈ కోర్సు చేసిన వారికి వరంగా మారింది. కారణం డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్ఓటీ పోస్టుల సంఖ్యే ఎక్కువగా ఉండటం.

   బీఈడీ

గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు అవకాశం కల్పస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ). వ్యవధి ఏడాది. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్‌సెట్ రాయాలి. మొత్తం 5 సబ్జెక్టుల్లో ఎడ్‌సెట్ నిర్వహిస్తారు. అవి.. బయలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, సోషల్ స్టడీస్. విద్యాతత్వ శాస్త్రం, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, పాఠశాల పరిపాలన-నిర్వహణ, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ టెక్నాలజీతోపాటు గ్రాడ్యుయేషన్ స్థాయిలో చదివిన గ్రూప్ సబ్జెక్టుల్లో రెండింటికి సంబంధించిన బోధన పద్ధతులు బోధిస్తారు. శిక్షణ సమ యంలో 45 రోజులపాటు పాఠశాలకు వెళ్లి బోధన ప్రాక్టికల్స్) చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 615 కాలేజీల్లో దాదాపు 65 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీ.ఈ.డి ఉత్తీర్ణులు.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులకు అరులు. వీరిని స్కూల్ అసిస్టెంట్లుగా వ్యవహరిస్తారు. డీఎస్సీ ద్వారా ఎస్ఏ ఎంపిక జరుగుతుంది.

ఫిజికల్ ఎడ్యుకేషన్

 ప్రభుత్వం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా ప్లే గ్రౌండ్ ఉండాలని నిబంధన విధించింది. తదనుగుణంగా ప్రతి పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) ఉంటారు. మనరాష్ట్రంలో రెండు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీడీపీఈడీ), అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీ ఈడీ), అరత: ఏదైనా గ్రాడ్యుయేషన్. వీటిలో ప్రవేశానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) రాయాలి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 13 కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీపీఈడీ చేసిన అభ్యర్థులు… హైస్కూల్స్ లో  పీఈటీలుగా కెరీర్ ప్రారంభించవచ్చు. డీఎస్సీ ద్వారా పీఈటీల ఎంపిక ఉంటుంది.

      భాషా పండితులు

    (లాంగ్వేజ్ పండిట్స్)

తెలుగు, హిందీ వంటి భాషలను బోధించడానికి కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండాలి. అటువంటి స్కిల్స్‌ను పెంపొందించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్పీసెట్) రాయాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండిట్ కోర్సులు అందు బాటులో ఉన్నాయి. తెలుగు పండిట్-

అరత : బీఏ (తెలుగు లిటరేచర్/ ఓరియెంటల్ లాంగ్వేజ్-తెలుగు/తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్/ఎంఏ – తెలుగు). హిందీ పండిట్: హిందీ ఆప్షనల్తో డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్ హిందీ/దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రవీణ లేదా హిందీ ప్రచార సభ- హైదరాబాద్ విద్వాన్ కోర్సు లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న హిందీ (బీఏ స్థాయి)/ తత్సమానం లేదా ఎంఏ (హిందీ). ఈ కోర్సులను పూర్తిచేసినవారు.. డీఎస్సీ రాసి ప్రభుత్వ పాఠశాలల్లో లాంగ్వేజ్ పండిట్ లుగా చేరొచ్చు.

 స్పెషల్ ఎడ్యుకేషన్

మానసిక, శారీరక వైకల్యాలతో బాధ పడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ కోర్సులో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటు లో ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌ను ప్రత్యేకంగా పరిగణించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు (ఆర్సీఐ)కి అప్పగించింది. ఈ కోర్సులను పూర్తి చేస్తే దేశ, విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీ స్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవ లందించవచ్చు. అంగన్వాడీ పాఠశాలలు, ప్రైవేటు ప్రీ స్కూళ్లలో ప్రత్యేక శిక్షణ అవసరమైన చిన్నారులకు కోఆర్డినేటర్‌గా అవకాశాలు లభిస్తాయి. సొంతంగా ప్రీ స్కూల్‌ను నిర్వహించవచ్చు. జీతభత్యాలు ప్రారంభంలో నెలకు రూ.8000-12000 వరకు ఉంటాయి. రెండు, మూడేళ్ల అనుభవం తో నెలకు రూ.25000 వరకు అందుకోవచ్చు. మన రాష్ట్రంలో.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీ క్యాప్డ్ – సికింద్రాబాద్ స్వీకార్ రిహాబిలి టేషన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్ సికింద్రాబాద్ ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నం శ్రీ పద్మావతి మహిళ విశ్వ విద్యాలయం-తిరుపతి కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-ఆంధ్ర మహిళ సభ-హైదరా బాద్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి. డీఈడీ (స్పెషల్ ఎడ్యు కేషన్) చేసినవాళ్లు బీఈడీ, ఆ తర్వాత ఎంఈడీ కోర్సులు అభ్యసించొచ్చు.

 టెట్ తప్పనిసరి:

టీచర్ గా ప్రభుత్వ పాఠశాలల్లో అడుగు పెట్టాలంటే.. రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కేంద్రస్థాయిలో కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఉపాధ్యాయ నియామకాలకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీ ఈటీ) స్కోర్ తప్పనిసరి. టెట్ మార్కులకు ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలో 20 శాతం వెయిటేజీ లభిస్తుంది. టెట్, సీటెట్ల స్కోర్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.

   రెండు పేపర్లుగా ఉండే టెట్..

పేపర్-1: ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించాలనుకునే టీచర్లు ఈ పేపర్ రాయాలి.

పేపర్-2: ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే టీచర్లు ఈ పేపర్ రాయాలి.

టెట్ జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, శారీరక వికలాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్లే. సీటీఈటీలో ఓపెన్ కేటగిరీ 60 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణత సాధించినట్లు.

స్కిల్స్ 

విషయాన్ని ప్రభావవంతంగా వివరించే

కమ్యూనికేషన్ స్కిల్స్

మూస ధోరణితో కాకుండా విభిన్న పద్ధతుల్లో బోధించే నేర్పు

ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ విద్యార్థు లకు అవగాహన కల్పించడం

సానుకూల దృక్పథం కలిగి ఉండడం. 

సబ్జెక్ట్‌పరంగా వస్తున్న మార్పులను

గమనించడం.

తను నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటూ విద్యార్థుల్లోనూ నాయకత్వ లక్షణాలు పెంచడం.

ఉన్నత విద్య ద్వారా ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవడం సమయస్ఫూర్తి కలిగి ఉండడం.

విద్యార్థులను అకడెమిక్తో పాటు పాఠ్యే తర కార్యక్రమాల్లోనూ (కోకరిక్యులర్ యాక్టివిటీస్) నిష్ణాతులుగా తీర్చిదిద్దడం. విభిన్న వర్గాల (ఉన్నత స్థాయి, మధ్య స్థాయి, దిగువస్థాయి ప్రతిభ ఉన్న చిన్నారులు)కు వారికి తగిన విధంగా బోధన చేయడం.

అవకాశాలు

ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తి ఆకర్షణీయ ‘మైన ఉపాధి మార్గంగా మారుతోంది. ప్రభుత్వం తరచూ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా వేలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తుండటం దీనికి ప్రధాన కారణం. అంతే కాకుండా ఉద్యోగ భద్రత రీత్యా చూసినా, వేతనాల విషయంలోనూ టీచింగ్ బెస్ట్ కెరీర్ ఆప్షన్‌గా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్రీయ విద్యాలయాలు, జవహార్ నవోదయ విద్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండే స్కూల్స్ కూడా అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగం రోజురోజుకు విస్తరించి చిన్నపట్టణాల్లోనూ కాన్వెంట్లు, నర్సరీలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఏర్పాటవుతుండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. ప్రతిభ, అనుభవం ఆధారంగా ప్రైవేట్ సంస్థలు నెలకు దాదాపు రూ. 15 రూ.20 వేల వరకు చెల్లిస్తున్నాయి.

ప్రమోషన్లు 

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా.. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్ఓటీ), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా కెరీర్ ప్రారంభించి, ఉన్నత విద్యనభ్యసిస్తే ఉన్నత స్థానాలకు చేరుకో వచ్చు. ఎస్‌ఓటీలు బీఈడీ/ ఎంఈడీ చేసి స్కూల్‌అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందొచ్చు. ఎస్ఏలు పనితీరు, అనుభవం ఆధారంగా మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో), జిల్లా ఉప విద్యాశాఖాధికారి స్థాయికీ చేరుకోవచ్చు. పీజీ పూర్తిచేస్తే.. జూనియర్ లెక్చరర్‌గా పదోన్నతి పొందొచ్చు.

      ఉద్యోగావకాశాలు ఎక్కువ

ఈ రోజుల్లో ఉపాధ్యాయ వృత్తికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సువర్ణావకాశం ఈ వృత్తి ద్వారా టీచర్లకు కలుగుతుంది. అంతేకాకుండా కెరీర్‌పరంగా, పనిగంటల రీత్యా చూసిన ఉపాధ్యాయ వృత్తి మిగిలిన రంగాలకు దీటుగా నిలుస్తోంది. టీచర్ గా పనిచేస్తూనే ఉన్నత విద్యనభ్యసించి మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లోనే కాకుండా ప్లే స్కూల్స్, నర్సరీలు, వివిధ కార్పొరేట్ సంస్థలు మండల కేంద్రాల్లో కూడా ఏర్పాటవుతున్న నేటి రోజుల్లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు చేసినవారి కోసం మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *