భయపెట్టేస్తున్నారు…

భావి భారత పౌరుగ్లను తీర్చిదిద్దే టీచింగ్
August 29, 2021
మాదకద్రవ్యాల మత్తులో యువత
August 29, 2021

సరదాగా చేసిన ప్రయాణంలో ఎన్నో వాస్తవాలు.. మరెన్నో కదలికలు.. ఎన్నో భావాలు… భయాలు. అవి మీతో పంచు కుందామనే ప్రయత్నంలో భాగమే ఈ కథనం. ఇటీవల ఆగ్రాలో మతమార్పిడికు సంబంధించిన విషయం 200 మంది 57 ముస్లిం కుటుంబాలు అంటే 200 మంది ఇస్లాంని వదిలి హిందూయిజంను తమ ధర్మంగా ప్రకటించారని పత్రికలలో కథనాలు రావటం దానికి సంబంధించి పార్లమెంట్లో మత మార్పిడి చట్టంకు గురించి ఓ చర్చ జరగటం అందరికి తెలిసిన విషయమే. సరే వాళ్ళు మత మార్పిడి అయ్యారా లేదా అనేది ఇప్పుడు నాకు చర్చనీయాంశం కాదు. తెల్లకోటు వేసుకున్నంత మాత్రాన డాక్టర్ అనీ, ఖాకీ డ్రస్ వేసుకున్నంత మాత్రాన పోలీస్ అని చెప్పలేం. ఎవరయితే వాటికి సంబంధిం చిన ట్రయినింగ్ పూర్తి పట్టాలు పొందు తారో వాళ్ళనే మనం ఆయా పేర్లతో పిలుస్తాం. అలాగే ఎవరయితే సృష్టిని సృష్టించాడో… భూమిని, ఆకాశాన్ని, తనను (మానవుడిని) సృష్టించాడు అలాంటి దైవాన్ని నమ్మటమే ఇస్లాం యొక్క మౌళిక అంశం ఒకవేళ అలా నమ్మకుండా కేవలం బాహ్య స్వరూపాన్ని వేసుకున్నంత మాత్రాన అతను ముస్లిం కాలేడు. నా దృష్టిలో ఏదో స్వప్రయోజనం కోసం మత మార్పిడి చేసేవాళ్ళకు ఎలాంటి ప్రాధాన్యత ‘లేదు. కేవలం అలా వచ్చిన వారిని చూసి ఎవరైనా మా మతంలో ఇంతమంది చేరారు.. మా మతంలో ఇంత మంది చేరారు.. అంటే పార్టీ ఫిరాయింపుల్లో మాదిరిగా మా పార్టీలో చేరికా… మా పార్టీలో చేరిక అన్నది కేవలం లెక్కింపు కోసమే పనికి వస్తుంది. దానిని చూసి బలం అనుకుంటారు అది వాస్తవానికి అది బలం కాదు వాపు మాత్రమే. ఎవరయితే నిజంగా ధర్మాలను చదివి అర్ధం చేసుకొని, వాటిలోని మూలాలు, ఆ ధర్మంలోని నియమాలు, జీవన విధానం వీటన్నింటిపై లోతైన అధ్యయనం చేసిన తరువాత ఎవరైనా మత మార్పిడి చేసి నట్లయితే వారు ఆ ధర్మబద్ధంగా జీవితం గడపగలరు.

మత మార్పిడి గురించి ఓపెద్ద స్కెచ్ల కనిపించేది ఏమంటే ముందు ఓ ధర్మాన్ని టెర్రరిజం, ఉగ్రవాదం అని భయపెట్టండి అక్కడి వారు భయాందోళనకు గురైన ప్పుడు వారితో సులభంగా మత మార్పిడి చేయించవచ్చు. రెండవ పద్ధతి కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ఫలానా దైవాన్ని కోరిన వెంటనే నీవు సుఖపడిపోతావని నమ్మిం చండి మనిషి కష్టాలు శాశ్వతం కాదు అవి ఖచ్చితంగా ఏదో ఒకరోజు సుఖాలుగా మారతాయి అది మా దేవుని మహిమే అనేయండి మత మార్పిడి చేయించండి.

ఇక మూడవది బలహీనతలను అడ్డం పెట్టుకొని బాబాలు, స్వామీజీలకు మూలాధారమైన ట్రిక్. వారికి వద్దకు వచ్చే ప్రజల బలహీనతలే వీళ్ళకు ప్లస్ పాయింట్. 

దిగంబరులు ప్రయాణిస్తుంటే వారినీ స్వామీజీలు, బాబాలు అని నమ్ముతుంది మన సమాజం, సగం బట్టలేసుకున్న మహిళను చూస్తే ఫ్యాషన్, వెస్ట్రన్ కల్చర్ అని మురిసి పోతుంది ఈ సమాజం. కానీ ఎవరయినా ట్రెడిషనల్ డ్రస్ వేసుకుంటే మాత్రం మూర్ఖుడని, మత ఛాందసవాదని, కరుడుగట్టిన మతోన్మాది అని పేర్లు పెట్టే స్తుంది. అదేంటి ఎవరు తమకు నచ్చిన మతాన్ని ఆ వస్త్రధారణ చేసే అవకాశం మనకు లౌకిక భారత దేశంలో ఉందికదా. ఇలాంటి లౌకిక దేశంలో ఓ ఎంపి లో నిలుచుని భారతీయు పార్లమెంట్ లంతా రాముని బిడ్డలే అలా కాదన్నవారు ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలి అనంటే కేవలం రికార్డుల నుండి తొలగిస్తాం ఆమె క్షమాపణ చెప్పింది అనే సాకు చూపి ఏమీ అనకుండా వదలివేశారు. అదే మరో ఎంపి ఓ సాధారణ పబ్లిక్ మీటింగ్లో చేసిన ప్రసంగాన్ని హైలెట్ చేసి అతనిని జైలుకు తీసుకువెళ్ళేంత పని చేశారు. అంటే పార్లమెంట్లో చేసిన తప్పులను సారీతో చరిపేయవచ్చు గానీ పబ్లిక్ మీటింగ్ చెప్తే ఓ మహా పాపంగా చిత్రీకరించారు. లౌకిక భారతదేశంలో ఎందుకో ఇప్పుడు లవ్ తగ్గిపోతుందనే సందేహం వస్తుంది.

ఓ దేశాన్ని ఓ పల్లెని, ఓ ప్రాంతాన్నో ఓ వ్యక్తినో ఓ తెగనైనా ఏదైనా అభియోగంగానీ అభాండం  గానీ వేస్తే వెంటనే వారంతా స్పందిస్తారు. అసలు అలా అనటం కూడా మానవత్వం అనిపించదు. ఉదా: ఒకడు తాగుబోతు ఉన్నాడని వారి కుటుంబమంతా తాగుబోతులే అనలేం కదా. ఓ బస్తీలో వ్యభిచరించే వారు కొందరు ఉన్నంత మాత్రాన ఆ బస్తీలో నివసించే వారందరినీ వ్యభిచారులు అనలేం. దొంగతనం చేసి పట్టుబడిన వ్యక్తి ఫలానా ఊరివాడు కాబట్టి ఆ ఊరి ప్రజలంతా దొంగలే అని కూడా అనలేం అలాగే గిరిజనులు కొందరు మావోయిస్టులుగా ఉన్నంత మాత్రాన గిరిజను లందరూ మావోయిస్టులే అనలేం. ఎప్పు డైనా గిరిజనులను ఇన్ఫార్మర్ల నెపంతో కాల్చి వేసినట్లయితే వెంటనే మానవ హక్కుల కమీషను ఆశ్రయించి న్యాయ అన్యాయాల విచారణను ఎంతో మంది చేపడతారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అలా వచ్చిందే మనందరికీ తెలుసు వారిని కుల, మతం పేర్లతో దూషించ కూడదు. మరెందుకు ఇస్లాంను మాత్రం నిర్మొహమాటంగా ఉగ్రవాదులు తయారు చేసే ధర్మంగా చిత్రీకరిస్తున్నారు. మానవ హక్కుల కమీషన్కు ముస్లిముల మనో వేదన కనపడటం లేదా..? లేక వీరు పడేది క్షోభగా కనబడటం లేదా..? టీవీలు, సినిమాల్లో గడ్డాలు టోపీలు పెట్టడం ఉగ్రవాదులుగా చూపించటం పరిపాటిగా మారిపోయింది. బెంగుళూరులో ఒకడు పట్టుబడ్డాడు, ఢిల్లీలో ఒకడు పట్టుబడ్డాడు. కాబట్టి ముస్లిం లందరూ ఉగ్రవాదులే. కొంచెం గడ్డంగానీ, సాంప్రదాయ దుస్తులు వేసికున్న వెంటనే జీహాద్ అనే ముద్దు పేరుపెట్టే పరిస్థితి మన భారతదేశంలో విస్తరించింది. బాధాకరమైన విషయమేమి టంటే ఇతరుల మాట దేవుడెరుగు ముస్లిం సోదరులు కూడా ఈ విషయమే నోరెమెదిపేటందుకు జంకుతున్నారు. ఇస్లాంపై వేస్తున్న అపవాదును అపేందుకు కూడా సాహసించలేకపోతున్నారు. భరతదేశంలో స్వాతంత్ర్యం కంటే ముందు నుంచే ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నారే.. ఎంత మంది ముస్లిం ఇళ్ళల్లో కత్తులు ఉన్నాయి? ఎంత మంది గన్నులు పట్టు కొని తిరుగుతున్నారు? భాయి.. భాయి అనుకుంటూ తిరిగే హిందు “ముస్లిం” క్రైస్తవుల మధ్య ముస్లింలు టెరరిస్టులు అనే భావనను పాదుగొల్పేందుకు తీవ్రంగా కొన్ని అదృశ్య శక్తులు కుటిల యత్నాలు చేస్తున్నాయి. రాయలసీమలో బాంబు పేలితే పాత గొడవలు, కక్షలు, హైదరా బాద్ లో పేలితే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇస్లాం ఉగ్రవాదులు అని పేరు పెట్టేస్తున్నారు. ఎక్కడ ఏది జరిగినా వెంటనే ఓ ముస్లిం పేరు పెట్టడం తరు వాత గడ్డం ఉన్న వ్యక్తి ఫోటో చూపటం ఓ ఉగ్రవాద సంస్థను దానికి తగిలించడం. భారతదేశంలో ముస్లిం అని చెప్పుకోవ దానికే భయపడే రోజులొస్తాయేమోనన్న భయాని కలిగించే విధంగా ప్రసార మాధ్యమాలు పని చేస్తున్నాయి. సాధారణ విషయాలలో అంతర్జాతీయంగా వార్తలను చూపించని మాధ్యమాలు సాయిబు పేరు బాంబు పేలుడు ఉంటే వెంటనే మన దగ్గర కూడా వాటిని హైలెట్ చేసి చూపిస్తారు ఇక్కడి సాయిబులకి ముచ్చె మటలు పట్టేల వాటినీ చిత్రీకరిస్తారు. అలా అని నేను వీరిని సమర్ధించటం లేదు ఫలానా వ్యక్తి బాంబు పెట్టడం వల్ల ఇంత మంది చనిపోయారని చూపటం తప్పు లేదు. కానీ దానిని హైలెట్ చేసి మతాన్ని జొప్పించి ఈ మతంలో ఉన్నవారంతా ఇంతే అన్నంతలా చూపడాన్ని వ్యతిరేకిస్తు న్నాను. పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, అమెరికా ఈ దేశాలలో క్రైమ్ రేట్ అధికంగా ఉ ంటే ఆ దేశాలను తప్పుపట్టటం తప్పేమీ కాదు. అమెరికాలో క్రైం జరిగితే అమెరికా క్రైం దేశంగా చూపించటం తప్పేమీ కాదు కానీ క్రిస్టియన్ దేశంలో క్రైం రేట్ ఎక్కువ అంటే తప్పు అనేది నా వాదన. ఓ తప్పు పాపానికి అందరికి అంటగట్టడాన్ని తీవ్రంగా ఖండించాలనేది నా ఆలోచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *