జవాబుదారీతనం

మాదకద్రవ్యాల మత్తులో యువత
August 29, 2021
ఎస్ఐ.ఓ ఆధ్వర్యంలో బహుమతుల ప్రదానం
August 29, 2021

మానవ చరిత్రలో ఆది నుంచి నేటి వరకు ప్రతి కాలంలోనూ నాయకుడు మరియు నాయకత్వం ప్రస్థానం! ఉనికి కలదు. ఈ నాయ కత్వపు ప్రస్థానం క్రమక్రమంగా పెరుగుతూ సామూహిక జీవితంలో దాని యొక్క (వాస్తవ అవసారినికి చేరుకుంది) ఆవశ్యకతను తప్పని సరిగా మార్చివేసింది.

ప్రస్తుతం నాయకత్వం రాజకీయ కోణంలో దీనిని గమనిస్తే ఇది శాసన రూపాన్నే ధరిస్తున్నది. ఈ నాయకత్వం కేవలం రాజకీయ పరంగానే కాకుండా (దీని యొక్క సంబంధం) వృత్తి, వ్యాపారం ఇలా జీవితంలోని ప్రతి రంగంలోనూ దీని సంబంధం కలదు. సామూహిక జీవితంలో, సంస్థలోను నాయకత్వం అనేది మొట్ట మొదటి పునాది.

నాయకుడు సంస్థ యొక్క భాగస్వామియై ఉంటాడు. అతడు సంస్థ యొక్క అవసరాల గురించి అధికంగా ఆలోచించే వాడై ఉంటాడు. తాము చేరుకోవలసిన గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది. ఆ స్థానాన్ని అధిరోహించడానికి తగిన) గల కృషి, ప్రయత్నం ఏ విధంగా ఉండాలి సభ్యులను ఏ విధంగా తయారు చేయాలి. ఈ పయనంలో ఎదురయ్యే కష్టాలను, సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలి మొదలగు విషయాలపై సుదీర్ఘ ఆలో చన అవగాహన కలిగి ఉండాలి.

సాధారణ నాయకత్వం మరియు ఇస్లామీయ నాయకత్వాలను గమనిస్తే రెంటికి ప్రణాళికబద్ధమైన పాలన మరియు రెంటిలోనూ హద్దులు వున్నాయి. కాని సాధారణ నాయకత్వంలో మానవ నిర్మిత ప్రణాళికలు మరియు హద్దులు కలువు. అందులో సందర్భానుసారం మార్పులు చేర్పులు కలవు. అందుమూలంగా అది తీవ్ర వాస్తవ ధ్యేయాన్ని చేరుకోలేదు. కాని మరో ప్రక్కన ఇస్లామీయ నాయకత్వాన్ని గమనిస్తే అందులో దైవం నిర్ణయించిన ప్రణాళికలు, నియమాలు కలవు. వాటిని మనిషి ఎన్నటికి మార్పులు చేయలేడు. ప్రాతినిధ్యం (ఖిలాఫత్) ఇస్లాం యొక్క మూలం, ఇస్లామీయ దృక్కోణం ప్రకారం మానవుడు అల్లాహ్ చే ఎంచుకోబడిన ప్రతినిధి. అతనికి ఒక హద్దు మేరకు అన్ని హక్కులూ ఇవ్వబడ్డాయి. అతనికున్న అధికారం దైవం ప్రసాదించి నదే. దైవం నిర్ణయించిన హద్దులకు లోబడి ఉండే అన్ని ఆచరణలు ఆమోదయోగ్యంగా పరిగణించబడతాయి.

నాయకత్వం దైవం ప్రసాదించిన బాధ్యతలలో అతి ముఖ్యమైన బాధ్యత. ఇది అతి సున్నితమైన కఠిన బాధ్యత నాయకత్వం అంటే కాదు, సేవచేయాలి అనే భావన అతనిలో జనించాలి. గొప్పదనం, హుందాతనంలో కాదు త్యాగం మరియు బాధ్యత యొక్క స్పృహ కలిగి ఉండటం నాయకునికి ఒక కఠోర మైన పరీక్ష లాంటిది.

నాయకత్వం ఒక కఠినమైన బాధ్యత. దాని పరిపూర్తికై విశ్వాసం మరియు సదాచరణలు (మంచిపనులు) తప్పనిసరి షరతులు. ఈ బాధ్యత యొక్క జవాబుదారీతనం ప్రపంచంలోనూ పరలోకం లోనూ ఉంటాయి. (ఇస్లామీయ చరిత్రలో ఇటువంటి ఆదర్శనీయమైన నాయకత్వం మరియు ఆదర్శ నాయకులు మనకు తుది వరకు గొప్ప ఆదర్శప్రాయులుగా ఉంటారు.)

ఇస్లామీయ దృక్కోణం ప్రకారం నాయకుని నియమాలు దైవాజ్ఞా పాలనలోనే వున్నాయి. ఇస్లాం నాయకత్వానికి అమానుతు యొక్క స్థానాన్ని ఇస్తుంది. ఇస్లామీయ సమాజంలో నాయకత్వం అనేది (వాంఛించే) లేక ప్రయత్నించే పదవికాదు. ముస్లిములు, ఉత్తములు. ఈ బాధ్యత నుండి తమను తాము కాపాడుకోవడానికి మరియు దీనినుండి తప్పించుకోవడానికి పరుగెత్తి ప్రయత్నం చేస్తారు.

ఇస్లాం సామూహిక జీవితాన్నే తప్పనిసరి చేసింది. జీవితంలో నిర్మాణా త్మక జీవనంకొరకు నాయకుడు మరియు నాయకత్వం తప్పని సరి. ఇది ఒక బృహత్తర బాధ్యత మరియు జవాబుదారీ తనం. (పూల పాన్పు కాదది, ముళ్ళబాట.)

ఇస్లామీయ సమాజం లేక సంస్థ తమ నాయకునిలో ఈ క్రింది గుణాలను వెదకటానికి ప్రయత్నిస్తుంది. అవి విశ్వాసం, విశ్వస నీయత, న్యాయం, బాధ్యత యొక్క స్పృహ, స్వీయ ప్రక్షాళన, సోదరభావ, విమర్శలను స్వీకరించడం, జ్ఞానం, సకల్పంలో దృఢత్వం, సహనం, స్థయిర్యం, ఓర్పు, దూరదృష్టి, క్షమించే గుణం మొదలగునవి.

ఇటువంటి గుణాలు కల ఆదర్శ నాయకులెందరో ఇస్లామీయ చరిత్రలో మనకు కలరు. ప్రళయం వరకు వారు మనకు ఒక ఉత్తమ ఆదర్శులుగా వుంటారు. ఒకవేళ ఈ గుణాలు ఆ వ్యక్తిలో లేకుంటే అతను నాయకత్వానికి అర్హుడు కాడు.

సాధారణ నాయకునికి మరియు ఒక ఆదర్శ నాయకునికి బేధం ఏదైనా ఉందంటే అది కేవలం ఆచరణ మాత్రమే. ప్రవక్త గారి ఒక హదీసు ప్రకారం అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు: “మీలో ప్రతి ఒక్కరూ బాధ్యులే మరియు ప్రతి ఒక్కరూ తమ బాధ్యత గురించి జవాబు చెప్పుకోవలసి ఉంటుంది” ఇస్లాంలో ప్రతి పని సంకల్పంతో ముడిపడి ఉంటుంది. సంకల్పం మంచిదైతే ఆచరణ మంచిదవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *