చదువులో పర్సెంటేజ్‌ల గొడవ!

ఉపవాసాల పరమార్థం
August 29, 2021

సాధారణంగా తల్లిదండ్రులకు తమ పిల్లలు వారి విద్య లో ఎల్లప్పుడూ 100 కి 100 స్కోర్ సాధించాలని అనుకొంటారు. తప్పు లేదు. సర్వసాధారణంగా అందరు పేరెంట్స్ ఇలాగే భావిస్తారు. తమ పిల్లలు పరీక్షలలో మంచి స్కోర్ సాధించాలని అనుకొంటారు. నేను ఒక ఉపాధ్యాయుడిని. నేను నా సోదరి జీనత్ ను ఆమె కుమార్తె పర్వీన్ 9వ తరగతి ఫలితాలు అడిగినప్పుడు హఠాత్తుగా ఆమె వదనం లో మార్పు వచ్చింది మరియు ఆమె కొన్ని సెకన్ల పాటు నా వైపు తెరిపార చూసింది. తరువాత ఆమె నెమ్మదిగా తన కుమార్తె కేవలం 89% మాత్రమే సాధించిందని చెప్పింది. తన కుమార్తె పరీక్షలలో సాధించిన దానికి తను సిగ్గుపడుతున్నాను అని చెప్పింది. ఆశ్చర్య పోవటం నా వంతయింది. నేను 90% మంచి స్కోర్ కదా అని చెప్పాను. పిల్ల బాగానే చదివింది అన్నాను. గుడ్ అని కుడా అన్నాను. 

సరిగ్గా అప్పుడే పొరుగింటిదిల్షాద్ ఆపా, మా అక్క జీనత్ ఇంటికి వచ్చింది. కుశల ప్రశ్నలు అయిన తరువాత మీ అమ్మాయి జేబా ఎలా చదువుతుంది? ఆమె ఎంత స్కోర్ సాధించినది అని క్యాజువల్‌గా అడిగాను. దానికి ఆమె విషణ్ణవదనం తో 92% వచ్చింది. అని చెప్పింది. ముబారక్ అంటూ నేను, మీరు అన్ని మంచి మార్కులు వచ్చినా ఎందుకు విచారంగా ఉన్నారు అని ప్రశ్నించాను. ఆమె నిరుత్సాహంగా వెళ్ళిపోయింది. ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్, ఒకే క్లాస్, మంచి మార్కులు సాధించారు. మంచి పర్సెంటేజ్ వచ్చింది అయినా ఎందుకు పిల్లల తల్లితండ్రులు బాదపడుతున్నారో నాకు అర్థంకాలేదు. మా అక్క తన కుమార్తె పొరుగింటి జేబా కన్నా తక్కువ సాధించినందుకు, జేబా తల్లి జేబా తన బందువులు పిల్ల బేనజీర్ కన్నా తక్కువ సాధించినందుకు విచార పడుతున్నారని అసలు సంగతి నాకు తరువాత తెలిసింది. బెనేజిర్ 94% సాధించినది సంతోషం. ఒక ఉపాధ్యాయునిగా నేను ఈ పిల్లల తల్లిదండ్రుల వైఖరి కి ఆశ్చర్యపోయాను. ఈ పిల్లల తల్లితండ్రులు ఏమని అనుకొంటున్నారు? కేవలం తమ పిల్లలు చదువు కోసమే పుట్టారా? వారికి వేరే వ్యాపకం లేదా? 94%-95% సాధించడమే వారి పనా! వారి విద్యార్థి జీవితానికి మార్కులు, పర్సెంటేజీ లు తప్పితే వేరే ఉద్దేశం లేదా? వారు చదువులో మార్కులు తెచ్చే యంత్రాలా! అని నాలో నేను ఆశ్యర్యపోయాను.

ఫలితాల సీజన్

సాధరణంగా ఏప్రిల్ మరియు మే నెలలలో పరీక్ష ఫలితాలు విడుదల చేయబడతాయి. ప్రతి ఇంట్లో ను ఇదే చర్చ జరుగుతుంది. మా అమ్మాయి కి ఎంత పర్సంటేజ్ వచ్చింది, అవతలవారి అబ్బాయి ఎంత సాధించాడు? వాడి ఫ్రైండ్ పర్సెంటేజ్ ఎంత? అని అడుగుతుంటారు. పూర్వం లాగా పాస్ అయ్యాడా? లేదా? అని ఎవరు అడగటం లేదు. తమ పిల్లల కన్నా వారి సహచరులు స్కోర్ చేసిన శాతాల చుట్టూ వారి మనస్సులు తిరుగుతూ ఉంటాయి. తమ పిల్లలు తక్కువ వర్సెంటేజ్ సాధించారు అనగానే సిగ్గు పడుతుంటారు. మరియు మౌనంగా ఉంటున్నారు. తాము ఆ స్థితిలో ఉండటానికి తమ పిల్లలు కారణం అని భావిస్తూ వారిని నిందిస్తూ ఉంటారు. వారి చదువు కోసం ఎంత ఖర్చు చేసామో అని చెప్పి బాధపడుతుంటారు. పాపం, నేటి పిల్లలు 21వ శతాబ్దపు చదువు పేద పిల్లలు.

అసలు ఈ పర్సెంటేజ్ ల గోల ఏమిటి? వాటి పట్ల తల్లి-తండ్రులకు ఎందుక ఇంత వ్యామోహం? నాకు అర్థం కాలేదు. సరే, రాబోయే పది ఏళ్ళలో వారు ఏమి అవుతారు? గూగుల్ సీఈఓలా, లేదా ఆపిల్ సిఈఓ? లేదా ఫేస్బుక్ సీఈఓ నా? ఏ తల్లితండ్రులకు దీనిని గురించి వివరంగా తెలియదు. వారికి తెలిసింది తమ పిల్లలు విద్యా పరంగా అన్ని సంవత్సరాలు, అన్ని పరీక్షలలో 100 కి 100 శాతం సాధించాలి. నిజానికి పైన చెప్పిన కంపెనీల సిఈఓలు చదువులో అంత బ్రిలియంట్లు కాదు. వారు ఎప్పుడు 100 కి 100 శాతం సాధించ లేదు. నిజానికి వారిలో కొంతమంది స్కూల్-డ్రాప్-ఔట్లు.

తమ పిల్లల చదువులు, వారి మార్కుల పట్ల తల్లిదండ్రుల ఆత్రుతను ఒక ఉపాద్యాయుడిగా అర్థం చేసుకోగలను. కానీ, వాస్తవానికి తల్లిదండ్రులకు తమ పిల్లల భవిష్యత్ప సరైన అవగాహన లేదు.

వారిని ఏవిధంగా రూపొందించ దలచుకున్నారో, వారిని ఏమి చేయదలచు కున్నారో దీనిపై వారికి అవగాహన లేదు. దీర్ఘకాలిక ప్రణాళిక లేదు. వారు ఎంత సేపటికి తాత్కాలికంగా ఎంత పర్సెంటేజ్ సాధించాడు అనేది మాత్రమె ఆలోచిస్తారు. తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి వర్సెంటేజ్ విషయంలో బాధ లేదా ఆనందపడుతుంటారు. తమ పిల్లలు సాధించవలసిన పెర్సెంటేజ్ ని ముందే నిర్ణయిస్తారు. వాళ్ళను చదివే యంత్రాలుగా చూస్తారు. ఏ యంత్రం ఎంత వర్సెంటేజ్ సాధిస్తుంది అని ఆలోచిస్తారు.

నిజమే, సమస్య మన భారతీయ విద్యావ్యవస్థ (ఐఈఎస్)లో ఉంది. కొన్ని స్కూల్స్ మరియు కాలేజీలు కూడా ఈ పెర్సెంటేజ్ మాయలో ఉన్నవి. అడ్మిషన్ కేవలం బ్రైట్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఇస్తున్నారు. నిజమే, సమస్య మన భారతీయ విద్యావ్యవస్థ (ఐఈఎస్)లో ఉంది. కొన్ని స్కూల్స్ మరియు కాలేజీలు కూడా ఈ పర్సెంటేజ్ మాయలో ఉన్నవి. అడ్మిషన్ కేవలం బ్రైట్ స్టూడెంట్స్ కి మాత్రమే ఇస్తున్నారు. ఉదా: లేడి శ్రీ రామ్ కాలేజి, సెయింట్ స్టీఫెన్ కాలేజి, డిల్లి యూనివెర్సిటీ లో కొన్ని సబ్జెక్ట్స్ లో అడ్మిషన్ కు కట్-ఆఫ్ మార్కు కొన్ని సందర్భాలలో 99% లేదా 100% ఉంటుంది. మరి అప్పుడు 80% లేదా 85% నంపాదించిన వారు ఏమి చెయ్యాలి. వారు తెలివితేటలు లేని వారిలో కలసి పోవాలా! వారి ఉద్దేశం ఏమిటి. 80% కంటే తక్కువ వచ్చిన వారు చదువు మానేయాలా? వారు చదువుకు పనికి రారా?

వర్సెంటేజ్ భావనను పెంచి పోషిస్తుంది విద్యార్థుల తల్లి తండ్రులా ? లేదా విద్యా సంస్థలా? ఎవరు దీనికి బాధ్యతవహించాలి. ఈ సందర్భంలో ఒక ఉదా: మొన్న జరిగిన బీహార్ 10వ తరగతి పరీక్షలలో మొదటి పది స్థానాలు సాధించిన వ్యక్తులు ఒక టి.వి. సంస్థ జరిపిన స్టింర్ఆపరేషన్ లో ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక పోయారు. ఒకరు పొలిటికల్ సైన్స్ అంటే వంటల శాస్త్రం అని వేరొకరు ఇంకోవిధంగా సమాధానం ఇచ్చారు. దానిపై పెద్ద ఎత్తున నిరసన చెలరేగి ఆ విద్యార్ధులకు రి-ఎక్జాం పెట్టడం, వారి ర్యాంక్స్ రద్దు చేయడం, దానిపై విచారణకు కమిటిని నియమించడం జరిగింది.

మనం ఆలోచించాలి.

అడ్మిషన్స్‌కు కట్-ఆఫ్ మార్క్ 80% లేదా 90%గా ఉంటే మరి ఎందుకు పాస్ మార్క్ 35 లేదా 40 గా పెట్టారు? 80% లేదా 90% గా ఉంటే దానికి తగినట్లుగానే విద్యార్థులు ప్రిపేర్ అవుతారు. ఇది అంత మంచి ఆలోచనగా కన్పించటం లేదు. త్వరలోనే ఈ పర్సెంటేజ్ విధానం కు వ్యతిరేకంగా తిరుగుబాటు వస్తుంది దాని వెనుక ఉన్న హేతుబద్ధత ప్రశ్నించబడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *