ఒక్క గంట

సర్వ మానవాళికి ఖుర్ఆన్ మార్గదర్శకం
August 29, 2021
మానవహక్కులు – ఇస్లాం
August 29, 2021

ప్రస్తుత ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో తప్పనిసరి అవసరాలలో ఒకటి స్మార్ట్ ఫోన్ ఒకటి. నేడురేపు మనిషి ఆహారం కన్న ఎక్కువగా ఫోన్ గురించే ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఏ ప్రయాణంలోనైనా ముందు ఫోన్ కు కావాల్సిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు. పవర్ బ్యాంక్, గానీ చార్జర్ గానీ ఏదో ఒకటి మొత్తానికి తన ఫోన్ ఆగకూడదనేదే అతని తపన. ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అంతే సంగతులు, తన సగం ప్రపంచం తనను వీడినట్లు బాధపడుతుంటాడు. అరె అది ఎవరో కాదు లేండి మనమైనా అంతే అంతగా ఈ ఫోన్ మనల్ని అడిక్ట్ చేసుకుంది. స్విచ్ అవ్ అయిన మరుక్షణం మనం చేయాల్సిన ఇంపార్టెంట్ కాల్స్, మనకు రావాల్సిన కాల్స్ ఎన్నో మరెన్నో మనకు గుర్తుకు వచ్చేస్తాయి. ఒక్క గంట అవకాశం దొరికితే వెంటనే ఫుల్ చార్జి చేసేవాణ్నే అని తెగ బాధపడాల్సి వస్తుంది.

సరే ఫోన్ గురించి కాస్త పక్కన పెడితే ఇప్పుడు మనకు సంబంధించిన చార్జింగ్ టైం రమజాన్. రమజాన్ నెల ప్రారంభ మయ్యింది అయిపోయింది కూడా. ఈ నెల మనలో అనేక విశ్వాసాలను, విశయా లను అలవాటు చేసేందుకు ప్రయత్నం చేసింది. సరే ఎవరు ఎంత చేసుకుంటే అంత సంపాదించుకున్నారనుకోండి. అదే నండి పుణ్యాలు. అందరిలో ఒక్క విషయం మాత్రం కామన్గాగా అనిపించి ఉంటుంది. అదే ఒక్క గంట రెస్ట్. రమజాన్ నెల ప్రారంభం నుండి ఎవరైతే ఉపవాసలు పాటించి తరావీహ్ వరకు అన్ని నమాజులు చేసి ఉన్నారో వారందరి ఆలోచనల్లోనూ ఇదే మాట ఉండి ఉంటుంది. ఒక్క గంట అవకాశం దొరికితే కునుకు తీద్దాం కొంత రెస్ట్ తీసుకుందాం.

అంతలా అందరూ అలసి పోతారు. కానీ ఎక్కడ కూడా నమాజులలో జాప్యం కానీ వదలడం కానీ చేయరు. నిజానికే ఈ స్ఫూర్తి నింపటమే చార్జింగ్ టైం ముఖ్య ఉద్దేశం కూడా. రమజాన్ నెల ప్రతి ఒక్కరిలో విశ్వాసాన్ని ఆ స్థాయిలో పెంచి వెళ్ళిపోతుంది. ఎంత అలనటకు గురైనప్పటికీ అల్లాహ్ ఆరాధనలో ఎలాంటి జాప్యం చేయరు. ఏ రోజు అలవాటు లేని వాళ్ళు కూడా తెల్లవారు ఝామున 3 గంటలకు వద్దనుకుంటునే లేవటం అప్పటి నుంచి నహరీ, నమాజులు, ఖుర్ఆన్ పారాయణం వీటితో బీజీ బిజీగా గడుపుతూ ఓ గంట ఎప్పుడు దొరుకుతుందా కాసేపు విశ్రాంతి తీసుకుందాం అంటూ నిరీక్షిస్తుంటారు.

జీవితమనే ప్రయాణంలో మనమందరం బాటసారులం కదా. రమజాన్ నెల మనకు చార్జింగ్ పెట్టేందుకు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ ను ఆయన చెప్పిన విధంగా ఆరాధించేందుకు ఇచ్చేదే ఈ మాసం. ఈ నెలలో చార్జింగ్ అయిన మన బ్యాటరీని తిరిగి రీచార్జి చేసేందుకు ఈ నెల 30 రోజుల పాటు చార్జింగ్ పెట్టి వెళ్ళి పోయింది. ఈ నెలలో ఎవరు ఎంత చార్జింగ్ పొందితే అంత కాలం రాబోయే రమజాన్ వరకు విశ్వాస మాధుర్యంలో ఉండవచ్చు తక్కువ తీసుకున్న వాళ్ళు బక్రీద్ కంటే ముందే ఈమాన్ విషయంలో స్విచ్ ఆఫ్ అయిపోతారు. ప్రపంచపు రంగుల్లో వడి పరలోకపు భయాన్ని మరచిపోతారు. మళ్ళీ రమజాన్ వచ్చే వరకు వారికి చార్జింగ్ దొరకటం ఎంతన్న కష్టమే మరి. ఎంతో వేచి ఉన్న రమజాన్ మాసం వచ్చి శుభాలను కురిపించి, తన బాధ్యతను పూర్తిచేసి మన బాధ్యత లను గుర్తు చేసి తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ రమజాన్ నెల వచ్చే వరకు మనం చేయాల్సిన పనులను మనకు నేర్పించి మరీ వెళ్ళింది. కాబట్టి వచ్చే రమజాన్ వరకు ఇప్పుడు తీసుకున్న ట్రైనింగ్ను కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరిపై ఉంది. కేవలం రమజాన్ మాసం వరకే ఉండి తరువాత స్విచ్ ఆఫ్ అయిపోతే రమజాన్లో సరైన ట్రైనింగ్ మనం పొందలేకపోయామనేది వాస్తవం మరి.

రమజాన్ నెలలో ఎలా అయితే ఒక్క గంట కోసం వెతుకున్నామో ఇప్పుడు ఆ ఒక్క గంట సమయం చాలు ఐదు పూటల నమాజులు ఆచరించడానికి కాబట్టి ఒక్క గంట ఇప్పుడు కూడా కేటాయించిన మాజు లను ఆచరించామంటే అల్లాహు ప్రసన్నత చేసుకోవడానికి మన శ్రమ కొనసాగుతున్నట్లే. రమజాన్ సమయ మంతా దైవప్రసన్నతకే గడిపాం కదా. ఇప్పుడు కొంత సమయం చాలు ప్రసన్నం చేసుకోవడానికి రమజాన్ లో పొందిన చార్జింగ్ ను కంటిన్యూ చేయాలని కోరుకుంటూ…. ఈద్ ముబారక్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *