ఉపవాసాల పరమార్థం

మానవహక్కులు – ఇస్లాం
August 29, 2021
చదువులో పర్సెంటేజ్ల గొడవ!
August 29, 2021

ప్రపంచ జీవరాశులలో మనిషి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాడు. దానికి కారణం అతనికి నుంచి, చెడుల విచక్షణజ్ఞానం ప్రసాదించడం జరిగింది తను చేసే ప్రతి కార్యానికి జవాబు చెప్పుకోవాలనే స్పృహ అతనిలో జనించాలి తద్వారా సమాజ నిర్మాణానికి తనవంతు పాత్రను పోషించాలి. ఇలాంటి వాటిలో ఉపవాసం అనేది మనిషిలో విప్లవాత్మకమైన మార్పుకు బీజం వేస్తుంది. ఉపవాసాన్ని అరబ్బీ భాషలో “సౌమ్” అంటారు. దీని అర్థం మనిషి తనను తాను నియంత్రించుకొనుట, మానవ శ్రేయస్సుకు భంగం కల్గించే పనులకు దూరంగా ఉండడం, దీని పరమార్ధం. ఉపవాసాల ప్రధాన ఉద్దేశ్యం మనిషిలో భయభక్తులు జనించడం, చెడును నిర్మూలిస్తూ, మంచిని స్థాపించడానికి అహర్నిశలు పాటుపడడం. తినడం, త్రాగడం, మనోవాంఛలకు మనిషిని దూరంగా ఉంచి, అతనిలో ఓర్పు, సహనాన్ని పెంపొందించడమే ఉపవాస ముఖ్య ఉద్దేశం. ఉపవాసం వల్ల మనిషిలో సహనగుణం అలవడుతుంది. ఆకలిదప్పికలను, కష్టనష్టాలను సహించే గుణం పెరుగుతుంది. ఆకలిదప్పికల వల్ల అలమటించేవారి గురించి, రోజుకు ఒక పూట కూడా ఓ రొట్టెముక్క సైతం నోచుకోలేని వారి గురించి, ఉపవాసం ఉండే వ్యక్తి అంచనా వెయ్యగలడు. ఇతరుల కష్టాలను, ఆపదలను తెలుసుకొని వాటిని దూరం చెయ్యడానికి ప్రయత్నం చేస్తాడు. పరస్పరం ప్రేమాభిమానాలు కనికరం, మృదువైఖరి, సానుభూతి, దయ, ఉపకారం, సోదరభావం లాంటి సద్గుణాలు జనిస్తాయి. అనాధలు, బీదసాదల కష్టనష్టాలలో పాలుపంచుకొని వారిపట్ల సానుభూతిని చూపించాలి. సహనాన్ని అలవర్చుకోవాలి. తద్వారా మనిషిలో ఉన్నతమైన లక్షణాలు వెలుగులోకి వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *