విమర్శ- పరమార్థం

పాలకుల ఆవేదన
August 28, 2021
కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం
August 28, 2021

సంస్థలోని అంతరంగిక చెడుల సంస్కరణ, దాని కార్యకర్తల శిక్షణ, నిర్మాణం కొరకు మేము సహాయం పొందిన మూడో ముఖ్య వనరు ఏమిటంటే తొలి రోజు నుండీ మేము జమాల్లో విమర్శించే హృదయాన్ని జాగృతపరిచే కృషి చేశాము. విమర్శ ప్రతి చెడును సరైన సమయంలో వేలెత్తి చూపుతుంది. అంతేగాక దాని సంస్కరణా స్పృహను జనింపజేస్తుంది. దేహం విషయంలో పరిశుభత్రకు ఉన్న ప్రాముఖ్యతే నైతికత విషయంలో విమర్శకు ఉంది. పరిశుభ్రత, పారి శుధ్యం     పాటించకపోతే     ఒక     పట్టణం     ఏ విధంగా దుర్గంధపూరితమైపోతుందో అన్ని రకాల వ్యాధులకు నిలయమైపోతుందో, సరిగ్గా ఇదే విధంగా విమర్శనా దృష్టితో చెడులను వీక్షించే కళ్లు, వెల్లడించే నోళ్లు వినే వీనులు ఒకవేళ మూసుకుపోతే ఏ జాతి, సంఘం లేదా సంస్థలో ఈ పరిస్థితి జనిస్తే అది చెడుగులకు కేంద్ర స్థానమై ఉంటుంది. అటుపై దాని సంస్కరణ ఏవిధంగానూ జరగదు. ఈ వాస్తవాన్ని మేమెన్నడూ మరువలేదు. మేము సామాన్య మానవుల, మనదేశ, మన సంఘ దౌష్ట్యాలను విమర్శించే విషయంలో ఏస్వేచ్ఛనైతే ఒసిగామో, అదే విమర్శనా స్వాతంత్య్రం మా సంస్థలో కూడా కొనసాగించాం. అదేమిటంటే, సంస్థలో ఎక్కడ ఏ చెడు ఉన్నా, దానిని సకాలంలో సూచించాలి. దానిని దూరం చేసే ప్రయత్నం జరగాలి. సంస్థలో ప్రతి వ్యక్తికీ కేవలం విమర్శించే హక్కు మాత్రమే ఒనగూడలేదు. అతడు ఏదైనా చెడు స్పృహ కలగగానే మౌనంగా ఉండకపోవడం అతడి విధి. తన తోటి సభ్యుల సొంత విషయంలో లేదా సామూహిక వ్యక్తిత్వంలో లేదా తమ సంస్థాగత క్రమశిక్షణలో లేదా సంస్థ నాయకుల్లో ఒకవేళ అతడికి ఏదైనా లోటు కనిపిస్తే దానిని నిరభ్యంతరంగా తెలియపరచడం. సంస్కరణా సందేశ మివ్వడం సంస్థలోని ప్రతి ఒక్క సభ్యుని సామూహిక విధుల్లోనిది. అదేవిధంగా ఎవరినైతే విమర్శిం చడం జరుగుతుందో వారు కూడా విమర్శను భరించడమేకాకుండా, ప్రశాంత హృదయంతో దానిపై ఆలోచించి, ఏలోటుపై అయితే సంజ్ఞ చేయబడిందో అదే గనక నిజంగా అతనిలో ఉ ౦టే దానిని దూరం చేసే వైపు దృష్టి సారించేలా, ఒకవేళ అతనిలో లోపం గోచరిం చకపోతే. విమర్శించే వారి తప్పుడవగాహనను లేవనెత్తే అలవాటు గలవారిగా చేశాము. ఈ వ్యవహారంలో విమర్శకు సంబంధించి బుద్ధిపూర్వక విధానాలు తెలియకపోవడం చేత అనేకమార్లు పొరపాట్లు కూడా దొర్లాయి. వాటి ద్వారా ఎంతోకాలం నష్టం కూడా భరించాల్సి వచ్చింది. కానీ దాని తర్వాత కూడా మేము ఎన్నడూ సంస్థలో విమర్శనా హృదయాన్ని సమసి పోనివ్వలేదు. దాని ప్రయోజనం ఏమిటంటే, సంస్థకు చెందిన ప్రతి ఒక్క సభ్యుడు పూర్తి సంస్థ శిక్షణ, నిర్మాణంలో సహకారమందిస్తున్నాడు, తన పరిపూర్తి శిక్షణలో దానినుండి సహాయం పొందుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *