ప్రళయం

ఎంత మంచి చేస్తే అంత చెడుకు దూరం
August 28, 2021
పాలకుల ఆవేదన
August 28, 2021

మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా కళ్ళు తెరుస్తూనే కనిపించే ఈ సుందరమైన సృష్టి ఒకనాడు క్షణాల్లో ధ్వంసమై కంటికి కనిపించకుండా పోతుంది. ఆ దినాన్ని ప్రళయం అంటారు. ప్రళయం సంభవించే రోజు ఈ సృష్టి అల్లాహ్ ఆజ్ఞతో అత్యంత భయంకరం గాను, భీకరంగాను మారిపోతుంది. అందులోని సమస్త జీవులు చిన్నాభిన్నమై నశించిపోతాయి. సూర్యుడు కాంతి హీను డయిపోతాడు. పర్వతాలు, కొండలు, ఏకిన రంగురంగుల ఉన్నిలా దూది పింజాల్లా కూలిపోతాయి. భూమి దాని తీవ్రతతో కుదిపి వేయబడుతుంది. భూమి, ఆకాశం తునాతునకలైపోతాయి. సముద్రాలు ప్రజ్వరిల్లిపోతాయి. నక్షత్రాలు ధూళిగా మారి పోతాయి. ఈ భయానక దృశ్యాలను చూపి మనుషులు, జిన్నులు, షైతాన్ లు, పెంపుడు జంతువులు, అడవి జంతువులు, పక్షులు, భీతిల్లి అన్నీ ఒక చోటికి సమీకరించబడతాయి. వాస్తవంగా మనుషులు మైకంలో ఉన్నట్లు తూలుతూ కనిపిస్తారు. కాని వారు మైకంలో ఉండరు. ప్రళయ బీభత్సం గురించి దివ్య ఖుర్ఆన్ గ్రంథంలో ఈ విధంగా చెప్పబడింది. ఓప్రజలారా! మీ ప్రభువుకు భయ పడండి. నిశ్చయంగా ప్రళయ సమ యాన జరిగే ప్రకంపనలు, మహాభీకర సంఘటలను మానవులు ఆనాడు చూస్తారు. పాలు పట్టే తల్లి తన బిడ్డను మరిచిపోతుంది. గర్భ వతుల గర్భాలు పడిపోతాయి. దైవదూత ఇస్రాఫిల్ మొదటిసారి బూర ఊదినప్పుడు, భూమి పర్వతాలు ఒకే ఒక దెబ్బకు తుత్తునియలుగా చేసివేయబడి నప్పుడు ఆ రోజు జరగవలసిన సంఘటన నిజంగానే జరిగిపోతుంది. అప్పుడు ఆకాశం బ్రద్దలైపోతుంది. మరి ఆ రోజు ఆకాశం పట్టు సడలిపోతుంది.

ఇక రెండవ శంఖం పూరించినప్పుడు దాని భయంకర గర్జనకు మొత్తం భూమి మీద ఉన్న జీవరాశులు చచ్చిపడిపోతాయి. అప్పుడు సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్ ఒక్కడే సజీవంగా ఉంటారు. భూమి చదునైన మైదానంగా మారుతుంది. ఆ తరువాత అల్లాహ్ ఇస్రాఫిల్ను మూడవ సారి శంఖం ఊదమని ఆజ్ఞాపించు తారు.

మూడవ సారి అల్లాహ్ ఆజ్ఞతో ఇస్రాఫిల్ శంఖం ఊదగానే తమ ప్రభువు ముందు హాజరు కావడానికి ఒక్కసారిగా మృతులు తమ సమాధుల నుంచి లేచి బిలబిలా బయటికి వస్తారు. ఆశ్చర్య చకితులై ఎవరు మమ్మల్ని మన పడకల నుంచి లేపారు?’ అని అంటారు. ఆ సమయంలో దిక్కులు పిక్కటిల్లే ఒకేఒక భీకర గర్జన వినబడు తుంది. అప్పుడు యావన్మంది పరలోకం లో అల్లాహ్ సమక్షంలో ప్రవేశపెట్టుతారు. ఆరోజు మానవులకు ఎలాంటి అన్యాయం జరగదు. ఎవరు ఎలాంటి కర్మలు చేసుకున్నారో అలాంటి ప్రతిఫలమే వారికి లభిస్తుంది. ప్రళయం వచ్చే ఘడియ, దేవదూతలకు గాని, దైవప్రవక్తలకు గాని, స్వాములకు గాని శాస్త్రజ్ఞులకుగాని, జ్యోతి ష్యులకు గాని మానవ మాత్రు లెవ్వరికీ తెలియదు. అది సృష్టికర్తకే తెలుసు. ఆ సమయం, ఆకాశంలోను, భూమిలోను మహా భారమైనదిగా ఉంటుంది. అది అకస్మాత్తుగా మానవులపై వచ్చిపడు తుంది. భూ మండలంపై ఉన్నవారంతా

నశించిపోవలసినవారే. శాశ్వతంగా మిగిలి వుండేది అల్లాహ్ ఘనత, గౌరవం, గొప్ప తనం అల్లాహ్ అస్థిత్వం మాత్రమే. ఈ ప్రపంచం అశాశ్వతమైనదని, ఒకరోజు ఈ విశ్వం అంతమైపోతుందని దివ్య ఖుర్ఆన్లో స్పష్టంగా వివరిం చబడింది. నేడు అల్లాహ్ కొన్ని సునామీలు, వరదలు, భూ కంపాలు, రోగాలు, తుఫాన్ల రూపం లో కొన్ని హెచ్చరికలు చేసి చూపించినా మానవులు ఈ అశాశ్వత ఐహిక సంపద, భవనాలు అధర్మంగా, అక్రమంగా గడించాలనే పరుగు పందెంలో పరుగెడు తున్నారు. నీతి, న్యాయం, ధర్మాలను పూర్తిగా విస్మరిస్తున్నారు.

అదేమి చిత్రమో దేవుడు సృష్టించిన తోలుబొమ్మలైన కొందరు ప్రళయదినానికి ఏకంగా ముహుర్తం పెడుతున్నారు? దేవుడు సృష్టించిన ఈ బ్రహ్మాండమైన సృష్టికి ముగింపు తేదీని మట్టిలో మట్టె పోయే మనుషులు ఎలా నిర్ణయించగలరో నమ్మేవాళ్ళు ఎలా నమ్మగలుగుతున్నారో అంతా అర్థంకాని అయోమయం! మరు క్షణంలో తమ గతి ఏమిటో తెలియని మనిషి ఏకంగా దేవుడు సృష్టించిన సృష్టి ధ్వంసమైపోయే తేదీని నిర్ణయిస్తున్నాడు! వానరులారా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *