కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం

విమర్శ- పరమార్థం
August 28, 2021
విద్యార్థులే నవ సమాజ మార్గనిర్దేశకులు
August 29, 2021

శిక్షించటంలో పొరపాటుకున్నా క్షమించటంలో పొరపాటు చేయడం నాయకునికి మిన్న”

ముహమ్మద్(స) (తిర్మిజి, హదీసు 1011).

ఈ మధ్య ఉత్సాహవంతులైన యువతీ యువకులు నాయకత్వ లక్ష ణాల గురించి అధ్యయనం చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే నాయకుడు అంటే ఎవరు? అతను వ్యక్తిత్వం ఎలా ఉండాలి? నాయకత్వ లక్షణాలు అతనిలో ఉన్నాయా? అనేది ప్రధానం. నాయకుడంటే ఇట్టే తయారై పోతారనుకోవద్దు. దానికి ఎంతో అవగా హన, అనుభవం, నైపుణ్యం అవసరం. వాటితోపాటు అందుకు తగిన వాక్చాతుర్యం, నేర్పు, ఓర్పు అన్నీ ఉండాలి. విజయాలకే కాదు, అపజయాలకూ కూడా ప్రాతినిధ్యం వహించగలిగే సామర్థ్యం నిండుగా వుండాలి “నాయకత్వమంటే నిరంతర అభ్యాసనమే.”

తన సామర్థ్యంతో ఇతరులలో ప్రేరణ కలిగించి, ఇతరులను ముందుకు నడిపిం చగలిగిన వారే నాయకులు. ఒక సంస్థను అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేస్తూ, సాటివారిలో ప్రేరణ కల్గిస్తూ ముందుకు తీసుకుపోయే వ్యక్తే నాయకుడు. నాయకత్వం అంటే కలలను కనటమే కాదు. వాటిని సాకారం చేయాలి. కలలు అందరికీ వస్తాయి. కలలను నిజం చేసు కొనే చర్యలను వ్యవస్థీకృతం చేసుకో వడమే నాయకత్వం. హెర్మన్ మాక్స్ టిప్రీ మాటల్లో చెప్పాలంటే “వాస్తవస్థితిని నిర్వచించడమే నాయకుని కర్తవ్యం”. 2000 ఏళ్ళ క్రితం నాటి చైనా నానుడి ఒకటుంది. “వాస్తవాన్ని అంగీకరించడం ద్వారా శక్తి పుంజుకోండి”. మనం మొదట మనకే నాయకులం, ఆ తర్వాతే మనవెంట వున్న వారికి నాయకులం.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్న కొద్దిలో ఎక్కువ చేయాలసి రావడం, పై నుంచి వచ్చే ఆదేశాల ఒత్తిడిని ఎదుర్కోవడం, నిరంతరం వస్తున్న సాంకేతిక మార్పులకనుగుణంగా తన్ను తాను లేదా సంస్థను సరిదిద్దుకోవటం లేదా సమస్యల క్లిష్టత నుంచి బయటపడటం అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక అవాంతరాలు ఎదుర్కొని సంస్థను ముందుకు నడిపించటం మరియు తనపై లేదా సంస్థ పై తగ్గుతున్న విశ్వాసాన్ని పెంచటం మొదలగునవి నాయకత్వానికి ఎదురవుతున్న పెను సవాళ్ళు లేదా అవరోధాలుగా పేర్కొనవచ్చును.

మంచి నాయకుడి లక్షణాలు

నిరంతరం సంస్థ ప్రగతి గురించి ఆలోచిస్తూ, తన ఆలోచనలను సభ్యుల కర్థమయ్యేలా చెప్పి, వారిని అదే విధంగా ఆలోచించేలా చేసి సంస్థను ప్రగతి వథంవైపు నడిపించడమే నాయకుడి ప్రథమ లక్షణం. నాయకుడు మొదట తాను మారి చూపించిన తరువాత తన అనుచరులను మారాలని కోరాలి. విజయం సమిష్టి కృషి వల్లే సాధ్యమవు తుంది. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంత సామర్థ్యం గల టీమ్ లీడరైనా సభ్యులతో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా వ్యవహ రించగలగాలి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారే నాయకుడిగా ఎదుగుతారు. 4. పురోభివృద్ధికి తోడ్పడుతారు.

క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత, నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ముఖ్యమైనవి. సమయపాలన లేని వారు విజయాలు సాధించలేరు. నాయకుడు పదిమందికి ప్రేరణ కలిగించేవాడై ఉండాలి. సానుకూల దృక్పథం అలవర్చుకోవాలి. నాయకుడు అనేవాడు గొప్ప వ్యూహకర్తగా ఉండాలి. దూరదృష్టి కూడా ఉండాలి. సమస్యలు గుర్తించడంతోపాటు వాటిని పరిష్కరించే సమయంలో వ్యూహా లను పక్కాగా అమలు చేయాలి. అదే సమయంలో టీమ్ సభ్యుల, సహచరుల వ్యూహాలనూ కూడా పరిగణనలోకి తీసు కొని పరిశీలించి అవసరమైతే స్వీకరించాలి. పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. ఎప్పటికప్పుడు మీ బలం, బలహీనత లను బేరీజు వేసుకోవాలి. బలహీనతలను టీమ్ సభ్యులపై రుద్దకూడదు. వాటికి కారణాలు పరిశీలించి లోపాల్ని సరిదిద్దు కోవాలి ఎవరైతే తన శ్రేయస్సు కోసమే కాక ఇతరుల మంచికోసం కూడా ప్రయత్నం చేస్తారో వారే నిజమైన నాయకులు. నాయకుడైనంత మాత్రాన అదేదో గొప్ప పదవిగా ఊహించుకొని ఇతర సభ్యులను నిర్లక్ష్యం చేయకూడదు. అసలు తాము ఆ స్థితికి రావడానికిగల కారణాలు ఎప్పుడూ మరచి పోకూడదు. ఇంకా ఎదుగుతూ, ఇతరుల ఎదుగుదలకు తోడ్పడాలి. ఇత రుల మీద అధికారం చేసేవాడు నాయ కుడు కాదు. నాయకునికి అధికారం సహజంగా లభిస్తుంది.

“కలలను సాకారం చేసుకొనే సమర్ధతే నాయకత్వం. దినం గడిచిపోయాక మరుసటి రోజును ఎదుర్కొటానికి నిన్ను నీవు సన్నద్ధం చేసుకొంటే, నువ్వొక జయశీల నాయకుడివి అని గుర్తించుకో”

– అబ్దుల్ కలామ్

నాయకుడికి ఉండేటటువంటి మొదటి లక్షణం తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం, దృఢనిశ్చయంతో ముందుకు కదలటమే. తను చేసే పనులు, మాట్లాడే మాటలు ఆలోచించే ఆలోచనలు అర్థవంతంగా, పది మందికి మంచిచేసేవిగా ఉంటాయి. లక్ష్యానికి కట్టుబడి ఉండటం అనేది నాయకునికి ఉండే లక్షణం. నాయకుడు చేసే పనులు పదిమందికి ఆదర్శంగా మారతాయి. నాయకుడు క్లిష్టమైన పను లను చేయడానికి ధైర్యంగా ముందుకు వెళతాడు. నాయకత్వ లక్షణాలున్న ప్రతి వ్యక్తీ నాయకుడే. నాయకుడు మార్గదర్శకంగా ఉంటూ ప్రోత్సహించేవాడు. నాయకుడు ఎప్పుడు చిరునవ్వుతో ఉంటూ విజయాన్ని కోరుకుంటాడు. ఏ దేశంలో అయితే నాయకత్వ లక్షణాలున్న పౌరులు ఎక్కువగా ఉంటారో ఆ దేశం దినదినాభివృద్ధి చెందుతుంది.

నాయకుడు నియమబద్ధ, బాధ్యత, విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతాడు. తన బలహీనతలను జయిస్తాడు. శారీరక సుఖాలకు బానిసైన వ్యక్తి. బలహీనతలకు, చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తి నిజమైన నాయకుడు కాజాలడు. నాయకునిగా ఎదగాలనుకున్న వ్యక్తికి బలహీనతలు, దురలవాట్లు, అత్మ న్యూనత, అధైర్యం ఉండకూడదు. సరైన నాయకుడు సత్కార్య నిర్వహణలో తన శరీరానికి జరిగే లేక రాబోయే ఆపదలను లక్ష్యపెట్టడు. నాయకుడు కష్టపడి పని చేయడమే కాకుండా ఇష్టంతో పని చేయాలి.

సత్యం, పవిత్రత, నిస్వార్థం వంటి సుగుణాలు కలిగిన వ్యక్తికి ఈ ప్రపంచ మంతా వ్యతిరేకంగా ఉన్నా అతను చేసే మంచి పనులను కొనసాగించగలడు. చాలామంది మంచి తనానికి ఇవి రోజులు కావని, నీతికి నిజాయితీకి కాలం చెల్లిందని భావిస్తున్నారు. నియమాలు త్యజిస్తే ధనవంతులం కాగలమని అనుకుంటున్నారు. అవినీతి అక్రమ సంపాదన, మోసపూరిత వ్యాపారాల ద్వారా అస్తులు కూడబెట్టాలని భావించి ఈ సమాజంలో సహజ న్యాయాన్ని మానవత్వ పునాదులను కదిలించటానికి ప్రయత్నిస్తున్నారు. కాని అది తాత్కాలికం. అటువంటివారికి పురోగతి ఉండదు. కాలక్రమంలో వారు చేసిన పనికి ఫలితం చెల్లిస్తారు.

మన గమ్యానికి మనమే భాద్యులం. ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచు కుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచు కుంటూ మన ముందున్న అనేక సమస్య లను జయించొచ్చు. గొప్ప విషయాలను సాధించొచ్చు. నాయకుడు అనేవాడు ఎక్కడినుండో రాడు. మనలో నుండే వస్తాడు.

నాయకుని ప్రధాన లక్షణాలు

అతను మానవతా విలువులు కలిగి ఉండి సహాయం చేయడంలో ముందు డాలి. కార్య సాధకుడిగా, స్ఫూర్తిదాయ కంగా ఉంటూ సేవకుడిగా పనిచేయాలి. తీసుకున్న పనిని బాధ్యతతో పూర్తి చేయాలి. ఎంత ఒత్తిడిలోనైనా అనుకున్న పని చేసి తీరాలి. ఓపికతో ఉత్సాహంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ తీవ్ర మైన ఒత్తిడికి గురికాకుండా సరైన నిర్ణ యాలు తీసుకోగలిగే సత్తాకలిగి వుండాలి.

తాను చేస్తున్న పని మీద పూర్తి అవగాహన, ఆ పని చెయ్యటానికి కావలిసిన పూర్తి సమాచారం, నైపుణ్యం ఉండాలి. ఇవి జన్మతః రావు, మనిషి తనంతటతాను సంపాదించుకోవాలి. వృత్తి సంబంధిత జ్ఞానం ఉన్నపుడే, సామర్థ్యం పెరుగుతుంది. వృత్తిపర జ్ఞానం, సామర్థ్యం లేనివాడు నాయకుడు కాలేడు. చక్కగా విశ్లేషించి, తగిన నిర్ణయం తీసుకోగల సామర్థ్యం ఉండాలి. నిర్ణయం తీసుకోవటమే కాదు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయం వల్ల నష్టం జరిగినా సరే. న్యాయదృష్టి, నిస్పక్షపాత ధోరణి, ఒత్తిడిని తట్టుకునే స్థయిర్యం తప్పనిసరిగా అతను కలిగుండాలి.

నాయకుడు సంస్థ పురోభివృద్ధికి చక్కని ప్రణాళిక వేసి అందర్నీ ఒప్పించి తనతో పాటు ముందుకు తీసుకు పోగల గాలి. తను వేసిన ప్రణాళిక విజయవంతం అయ్యేటట్లు కృషి చేయాలి. సరియైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలి. ఎవరు ఏ పని చేయగలరో తెలుసుకొని వారికి ఆ పని అప్పజెప్పి పూర్తి చేసేటట్లు చూడాలి.

నాయకుడు ఎల్లపుడూ ఇతరులలో ఉత్తేజాన్ని కలిగించాలి. మంచిని ప్రదర్శిం చాలి. సహచరుల్లో ప్రేమను పెంపొందిం పజేస్తూ ఎల్లపుడూ “మనం” “మన పని” అనే దానినే నమ్మాలి. ఏం తప్పు జరిగిందో విడమర్చి చెప్పాలి. ఎందుకంటే ఏపనైన ఎలా చేయాలో అతనికి తెలుస్తుంది. అంతేగాక అతను నలుగురిలో కలసి పోవాలి. సమర్ధనాయకుడు జాతిని ముందుకు నడిపించాలి. ముహమ్మద్ ప్రవక్త (స), హజ్రత్ ఉమర్ఫారూఖ్(రజి), నెల్సన్ మండేలా మొదలైనవారు చరిత్రలో నిలిచిన ఉత్తమ నాయకులు.

సత్ప్రవర్తనకు, సౌశీల్యనికి, నాయ కత్వానికి మారుపేరైన ముహమ్మద్ ప్రవక్త (స) నాయకత్వ లక్షణం గురించి ఈ విధంగా ప్రస్ఫుటించారు.

అల్లాహ్ తోనే విజయం సాధ్యమని నమ్మిన విధేయుడే ఉత్తమనాయకుడు”

మహమ్మద్ అఙ్గర్ అలీ, తెనాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *