ఎంత మంచి చేస్తే అంత చెడుకు దూరం

ఆండ్రాయిడ్ తో కొలువుదీరుదాం..!
August 28, 2021
ప్రళయం
August 28, 2021

మంచి చెడు ఎలా అయితే వీటిని మనం చదువుతామో…. అలానే ఎప్పుడూ ఇవి పక్క పక్కనే ఉంటాయి. మంచి చెడుకు మధ్య వ్యత్యాసం కూడా ఎంతో ఉండదు. న్యూటన్ చెప్పిన ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉన్నట్లే… ప్రతి మంచి వెనుక చెడు, చెడు వెనుక మంచి పయనిస్తూనే ఉంటుంది. మనం మంచి ఎంత ఎక్కువగా చేస్తామో.. చెడులకు అంత దూరమయ్యే ఆస్కారం ఉంటుంది. మానవ మెదడు ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఏదో ఒక ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. మనం దానికి ఏ పని చెప్పకపోయినట్లయితే అది దాని ఇష్టమొచ్చిన ఆలోచనలను రేకెత్తిస్తూ ఉంటుంది. దానిని నియంత్రించా లంటే మనం దానికి సరైన ఆలోచనలు చేసే పని చెప్పాలి.

ఉదాహరణకు మనం ఏదైన దూర ప్రయాణం చేయాలనుకోండి. రాత్రి మనం ఆ ఆలోచనలను ముందుగానే మెదడుకు సంకేతం ఇస్తాం. దాంతో రోజూ 7, 8 గంటలైనా లేవని మనల్ని తెల్లవారే సరికే మెదడు అలర్ట్ చేసి అలారంలా మోగి నిద్ర నుంచి మేల్కొ లుపుతుంది. నువ్వు ఊరేళ్ళాలి.. ఊరేళ్ళాలి… టైం అయిపోతుంది అంటూ మొట్టి కాయ వేసి మరి నిద్రాభంగం చేస్తుంది. ఇలా మనం దానికి ప్రేరణ కల్పించాలి.

ప్రవక్త (స॥) ఓ సారి సందర్భాను సార తన అనుచరులతో ఇలా అన్నారు… భార్యతో కలవటం కూడా ఓ పుణ్యమే అని. అది విన్న ఓ సహాబీ (అనుచరుడు) అదేంటి ప్రవక్త (సఅసం) అదేలా పుణ్యకార్యమవుతుంది. ‘నేను నా కోరికను తీర్చుకోవడానికి కలుస్తున్నట్లు అవుతుంది కదా?’ అన్నాడు. దానికి ప్రవక్త (సఅసం) ‘ఆ కోరికను నువ్వు ఆధర్మంగా చేస్తే పాపం. ధర్మ సమ్మతంగా చేస్తే పుణ్యమే అవుతుంది’ అన్నారు.

మనం ఏదైనా మంచి ఆలోచన చేస్తూ ఉండాలి. ఉదాహరణకు మన సంపాదనలో కొంత పేదలకి, ఆకలిగొన్న వారికి ఖర్చు చేద్దామనుకున్నాం. దానికి సంబంధించిన ప్లానింగ్ చేసు కుంటే ఇతర విషయాలకు ఖర్చు పెట్టే డబ్బు ఓ మంచి కార్యక్రమానికి సద్వి నియోగం చేసినట్లే. అదే మనం సినిమా చూడ్డానికి వెళ్ళితే 2, 3 గంటల అనవసరంగా సమయాన్ని వృథా చేస్తాం. ఒకవేళ సినిమాకు వెళ్ళకపోతే ఆ సమ యాన్ని ఎక్కడో ఒక చోట కచ్చితంగా గడుపుతాం కదా!

ఏ అంశమైనా ఏది మంచో ఏది చెడో అనేది మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. చేసే ప్రతి పనిని మనమే బేరీజు వేసుకోవాలి. ఇది మంచి పనేనా.. లేక అనవసరమైన పనా అని. అప్పుడు జవాబు కూడా దొరుకుతుంది. చెడు పనులు చేస్తే పాపమని, అలాంటి చెడుల నుంచి దూరమవ్వ టానికి మంచి పనులు చేస్తే పుణ్యమని తెలుసుకోవాలి. ఓ మంచి పని చేసా మనే ఆత్మసంతృప్తి మనకు కలగాలి. కాబట్టి ఖాళీగా ఉండకుండా అలాగని చెడుల్లో సమయాన్ని వృథా చేయ కుండా మంచి పనులలో ఎంగేజ్ అవ్వటం ఉత్తమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *