ఆండ్రాయిడ్ తో కొలువుదీరుదాం..!

ఉన్నత విద్య వెలవెల
August 28, 2021
ఎంత మంచి చేస్తే అంత చెడుకు దూరం
August 28, 2021

ఒకప్పుడు మొబైల్ అంటే మాటల ముచ్చట్లకే! కానీ, ఇప్పుడది హస్తాభరణమై భాసిల్లుతోంది. అందుకే నిన్నమొన్నటి వరకు మొరటుగా ఉన్న మొబైల్ ఇప్పుడు “స్మార్ట్‌ఫోన్”గా ముస్తాబై యువత మన సుల్లో కొలువుదీరింది. ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లు చాలా వరకు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆండ్రాయిడ్ నైపుణ్యాలను సొంతం చేసుకున్న యువతకు ఉన్నత కొలువులు ఆహ్వానం పలుకుతున్నాయి.

తొలుత టచ్ స్క్రీన్ ఫోన్లు, తర్వాత ట్యాబ్లెట్ కంప్యూటర్ల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)కు రూపకల్పన చేశారు. ఇది రోజురోజుకూ అభివృద్ధి చెందుతూ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. తాజా అధ్యయనం ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి గ్లోబల్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఫోన్ల వాటా 64 శాతంగా ఉంది. ఈ వాటా శాతం ప్రతి దినమూ పెరుగుతుండటంతో ఆండ్రాయిడ్ కోర్సు పూర్తిచేసిన వారికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది.

ఆప్స్ ల లోకంలో కొలువుల జాతర

మొబైల్‌కు ఓ అపరిచిత వ్యక్తి కాల్ చేశాడనుకోండి. కాల్ చేసిన వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నాడో కనుగొనాలంటే వెంటనే సంబంధిత ఆప్‌ని ఇన్స్టాల్ చేసుకొని వివరాలు పొందొచ్చు. మన స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో పనిచేస్తున్న ట్లయితే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ డెవలప్ మెంట్ కిట్ ఆధారంగా అభివృద్ధి చేసిన ఆప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రకరకాల అవసరాల కోసం అభివృద్ధి చేసిన ఆప్స్ ఇప్పటికే బోలెడు అందు బాటులో ఉన్నాయి. ఇలాంటి కొత్త కొత్త ఆప్స్‌ను అభివృద్ధి చేయాలనుకుంటే ఆండ్రాయిడ్ కోర్సులో చేరి యువత నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.

ఉత్పత్తి, సేవలరంగ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని వినియోగదారులకు సులువుగా చేరవేసేందుకు ఆండ్రాయిడ్ ఆప్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. మొబైల్-కామర్స్ ఆప్స్ కీలకపాత్ర ‘ పోషిస్తున్నాయి. మొబైల్ ద్వారా వివిధ రకాల బిల్లులు చెల్లించడం. మనీ ట్రాన్స్ఫర్ వంటి సేవలన్నీ ఆండ్రాయిడ్ ఆప్స్ ద్వారా సాధ్యమవుతాయి.

ఆర్థికం, వినోదం, విద్య, వైద్యం, ఉత్పత్తి రంగాలకు సంబంధించిన చాలా సంస్థలు పలు రకాల ఆప్స్ ద్వారా కార్య కలాపాలు నిర్వర్తిస్తున్నాయి. దీనివల్ల ఆండ్రాయిడ్ ఆప్స్ డెవలపర్స్‌కు డిమాండ్ పెరిగింది. మొబైల్ గేమ్స్ ఆప్స్క కూడా స్మార్ట్ ఫోన్ల వినియోగదారుల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆండ్రా యిడ్ కోర్సు చేసిన వారికి జాబ్ మార్కెట్లో మంచి అవకాశాలు సిద్ధంగా ఉన్నాయి.

ఆసక్తే అదనపు అర్హత:

మార్కెట్లో చాలా సంస్థలు ఆండ్రా యిడ్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. సైన్స్/ఐటీ కోర్సుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు ఆండ్రాయిడ్ కోర్సులో చేరొచ్చు. అభ్యర్థులకు బేసిక్ జావా ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండాలి. వీటితోపాటు ఎప్పటి కప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా ఉండాలి.

కోర్సు కాలం

పలు ప్రైవేట్ సంస్థలు 30-45 రోజుల కాల పరిమితితో ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వివిధ రకాల కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. సంస్థను అనుసరించి ప్రారంభ కోర్సుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఫీజు ఉంటుంది.

కోర్సులో ఏమి నేర్పుతారు? 

ఆండ్రాయిడ్ కోర్సులో భాగంగా హిస్టరీ ఆఫ్ ఆండ్రాయిడ్ నుంచి పబ్లిషింగ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ వరకు వివిధ అంశాల్లో శిక్షణిస్తారు. 

అవి:

ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్

ఆండ్రాయిడ్ ఇన్స్టాలేషన్ 

ఆండ్రాయిడ్ అప్లికేషన్

బేసిక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ ఫేస్ అడ్వాన్స్డ్ యూజర్ ఇంటర్ఫేస్ 

యానిమేషన్ – గ్రాఫిక్స్ 

నెట్వర్కింగ్, ఆండ్రాయిడ్ సర్వీసెస్ 

లొకేషన్ బేస్డ్ సర్వీసెస్

వైఫై, టెలిఫోనీ, కెమెరా, బ్లూటూత్

కోర్సులో భాగంగా థియరీ. ప్రాక్టికల్స్ ఉంటాయి. తరగతి గదిలో చెప్పిన అంశా లను ఎప్పటికప్పుడు ప్రాక్టికల్‌గా, అన్వయించి విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది.

కొన్ని సంస్థలు క్రాస్ట్ఫాం మొబైల్ అప్లికేషన్స్ అంశాలపై కూడా శిక్షణిస్తు న్నాయి. దీనివల్ల ఆండ్రాయిడ్‌లో డెవలప్ చేసిన ఆప్స్న ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ తో ఉపయోగించే స్కిల్స్ సొంతమవు తాయి.

ఆండ్రాయిడ్ కోర్సుకు ఉన్న డిమాం డ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ శిక్షణ సంస్థలు ప్రత్యేక కరిక్యులం తో కోర్సులను కూడా ఆఫర్ చేస్తు న్నాయి.

ప్రత్యక్షంగా కోర్సు చేయడమే మేలు: 

ఆన్లైన్ విధానంలో కోర్సు చేయడం కంటే ప్రత్యక్షంగా ఐటీ శిక్షణ సంస్థల తరగతులకు, ప్రాక్టికల్స్‌కు హాజరవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. సృజనాత్మక ఆలోచనలు వచ్చిందే తడవు ల్యాబుల్లో వాటిని అమలుచేసేందుకు అవకాశముంటుంది. ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్‌లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవాలంటే ఇది చాలా అవసరం. ఆండ్రాయిడ్ కోర్సుతో పాటు మరికొన్ని ఇతర ప్రోగ్రామ్స్ నేర్చుకుంటే కెరీర్ గ్రాఫ్ పైన ఉన్నట్లే.

ఏయే ఉద్యోగాలు ఉంటాయి: 

ఆండ్రాయిడ్ కోర్సు పూర్తిచేసిన వారికి మొబైల్ తయారీ సంస్థలు, ఆర్థిక, వినోద రంగ సంస్థలు, ఉత్పత్తి సంస్థల్లో ఉద్యో గావకాశాలు అందుబాటులో ఉంటాయి.

అవి:

మొబైల్ అప్లికేషన్ డెవలపర్ (జూనియర్,సీనియర్)

మొబైల్ అప్లికేషన్స్ టెస్టింగ్ స్పెషలిస్ట్. మొబైల్ గేమ్ డెవలపర్.

మొబైల్ అప్లికేషన్స్ మార్కెటింగ్ మేనేజర్.

వేతనాలు:

ఆండ్రాయిడ్ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18 వేలు నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది. నైపుణ్యాలు పెంచుకుంటే రెండు మూడేళ్లలోనే నెలకు రూ.60 వేల వరకు సంపాదించొచ్చు.

అత్యుత్తమ ప్రతిభావంతులైన, అనుభవమున్న అభ్యర్థులకు రూ.లక్షల ప్యాకేజీతో కొలువులను ఇచ్చేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి.

జూనియర్ మొబైల్ అప్లికేషన్ డెవలపర్ గా కెరీర్ ప్రారంభించిన వారు అను భవం, ప్రతిభ ద్వారా టీమ్ లీడర్ స్థాయికి ఎదగొచ్చు.

సొంతంగా ఆప్‌ను అభివృద్ధి చేస్తే దాన్ని గూగుల్ ప్లే (గతంలో ఆండ్రాయిడ్ మార్కెట్ లో పబ్లిష్ చేయొచ్చు. ఈ ఆపకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తే కాసుల వర్షం కురిసినట్లే.

శిక్షణా కాలంలో ప్రాజెక్టులో భాగంగా ఏదైనా ఆప్‌ను అభివృద్ధి చేసి నెట్లో పెడితే అది ఒకవేళ బాగా నచ్చితే కంపెనీలు పోటీపడి మరీ కొలువులు ఇచ్చేందుకు ముందుకొస్తాయి.

ఆప్స్ లో రకాలు:

మల్టీమీడియా ఆప్స్. 

బిజినెస్ ఆప్స్. 

ఈ-బుక్స్ పబ్లికేషింగ్ ఆప్స్.

మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆప్స్.

ట్రావెల్ ఆప్స్.

మ్యాప్స్ అండ్ నేవిగేషన్ ఆప్స్.

లైఫ్ స్టైల్ ఆప్స్.

హెల్త్, మెడికల్ ఆప్స్.

గేమ్స్ ఆప్స్.

ఎడ్యుకేషన్ ఆప్స్.

కోర్సులో చేరే ముందు ఆలోచించాల్సిన విషయాలు: 

ఐటీ శిక్షణ సంస్థకు మార్కెట్లో ఉన్న పేరు ఆండ్రాయిడ్ కోర్సు కరిక్యులం

ల్యాబ్ వసతులు 

ప్లేస్మెంట్ సౌకర్యం

టాప్ రిక్రూటర్స్:

సామ్సంగ్

పానాసోనిక్

సోనీ ఎరిక్సన్

మైక్రోమ్యాక్స్

ఎలీ మొబైల్స్

కార్బన్ మొబైల్స్

ఆర్థిక సేవల సంస్థలు ఇతర కోర్సులతో ఉన్నత స్థానా లకు..

ఆండ్రాయిడ్ కోర్సు చేసిన వారు ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్ డెవలప్ మెంట్‌కే పరిమితం కానవసరం లేదు. జీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్క సంబంధించిన కోర్సు కూడా చేసి ఐఫోన్, ఐపాడ్ లకు ఉపయోగపడే ఆప్స్‌ను కూడా అభి వృద్ధి చేయొచ్చు. ఐఫోన్ ఆప్స్ అభివృద్ధికి సంబంధించిన కోర్సుల్లో చేరాలంటే బేసిక్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

ఐఫోన్ ఆప్స్ కోర్సు కరిక్యులంలోని కొన్ని అంశాలు:

ఐఫోన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ (ఎల్డీకే).

ఆబ్జెక్టివ్- ఇ.

యూఐ అప్లికేషన్ అండ్ యూఐ అప్లికేషన్ డెలిగేట్.

యూఐ నేవిగేషన్ బార్, యూఐ నేవిగేషన్

కంట్రోలర్

ఎక్స్టెంఎల్ పార్సింగ్.

వెబ్ సర్వీసెస్.

మల్టిమీడియా.

కోర్ ప్లాట్(బార్ గ్రాఫ్స్), కోర్’గ్రాఫిక్స్

ఇంట్రడక్షన్

ఆప్స్ డెవలపర్లకు పెరుగుతున్న డిమాండ్

స్మార్ట్ ఫోన్లను వినియోగించే వారి సంఖ్య నిత్యం పెరుగుతోంది. 2012 అక్టోబర్ నాటికే ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్న వారి సంఖ్య వంద కోట్లు దాటింది. ధరలు అందుబాటులో ఉండటం వల్ల ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పోలిస్తే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పని చేసే స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వారి సంఖ్య అధికంగా ఉంది. అందువల్ల ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్స్‌ను అభివృద్ధి చేసే వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రతిభ ఉన్న ఆండ్రాయిడ్ ఆప్స్ డెవలపర్లకు శామ్సంగ్, సోనీ, మైక్రోమాక్స్ వంటి కంపెనీలు భారీ ప్యాకేజీలతో కొలువులను ఆఫర్ చేస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యా లతో పాటు సృజనాత్మక ఆలోచనలు, వాటిని అమలు చేయగల సత్తా ఉన్న వారు మాత్రమే మొబైల్ ఆప్స్ కోర్సు చేసి ఉన్నత స్థానాలకు ఎదగగలరు. ఆండ్రాయిడ్ కోర్సులతో పాటు ఇతర ఆపరేటింగ్ సిస్టమ్స్ (ఓఎస్)లకు సంబంధించిన కోర్సులు చేసి కెరీర్ గ్రాఫ్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. కోర్సులు పూర్తిచేసిన తర్వాత యువత సొంతంగా ప్రాజెక్టులు చేపట్టి స్వయంసమృద్ధి సాధించొచ్చు. మరింత ఉపాధి కల్పించవచ్చు.

Telecom Engineering

  టెలికాం రంగం పిలుస్తోంది…

నూట ఇరవై కోట్ల భారతదేశ జనాభాలో టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 90 కోట్లకు పైమాటే! దేశంలో చిన్నాపెద్ద టెలికాం కంపెనీలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు విదేశీ టెలికాం కంపెనీలు కూడా భారత మార్కెట్లో పాగా వేస్తున్నాయి. పట్టణాలతో పోటీపడుతూ పల్లెల్లోనూ సెల్‌ఫోన్ హల్చల్ చేస్తోంది. ఆయా కంపెనీల్లో వివిధ విభాగాల్లో లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడుతోంది. దాంతో టెలికాం రంగంలో అపార అవకాశాలు అందుబాటులోకి వస్తు న్నాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో వివిధ విద్యా సంస్థలు టెలికాం కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తిచేస్తే మంచి అవకాశాలను ఒడిసిపట్టొచ్చు. ఆ వివరాలు… 

లక్షల్లో ఉద్యోగాలు

రాబోయే ఐదేళ్లలో టెలికాం పరిశ్రమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి టెలికాం రంగంలో 2.75 లక్షల మంది ఉద్యోగులు అవసరమవుతారని టీఈ కనెక్టివిటీ సంస్థ అంచనా వేసింది. మరోవైపు దేశంలోని 2.75 లక్షల గ్రామ పంచాయతీలను ఇంటర్నెట్లో అను సంధానం చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒకప్పుడు పట్టణాలు, నగరాలకే పరిమితమైన ఇంటర్నెట్, ఐఫోన్, స్మార్ట్ఫోన్లు ఇప్పుడు పల్లెలకూ చేరువవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తులను సరఫరా చేయడం, మార్కె టింగ్ చేయడం ప్రస్తుతం టెలికాం రంగంలో విస్తృత అవకాశాలకు కారణమని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, కార్పొరేట్ రిలేషన్స్ డెరైక్టర్ పంకజ్ శ్రీవాత్సవ్ పేర్కొ న్నారు.

   ఆసక్తి ఉంటే అనేక మార్గాలు

టెలికాం అనగానే కేవలం టెక్నికల్ గ్రాడ్యుయేట్స్‌కు మాత్రమే అవకాశాలనేది అపోహే అంటున్నారు నిపుణులు. నాన్ టెక్నికల్, మార్కెటింగ్, సేల్స్, మానవ వనరుల విభాగాల్లో పని చేసేందుకు ఏ గ్రాడ్యుయేషన్ చదివిన విద్యార్థులైనా అర్హులే. టెక్నికల్ విభాగంలో ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్లు, మెయింట్ నెన్స్ సిబ్బంది అవసరం ఉంటుంది. ఆయా విభాగాల్లో టెక్నికల్ డెరైక్టర్, ఫీల్డ్ టెస్ట్ ఇంజినీర్, కస్టమర్ సపోర్ట్ ఇంజినీర్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, రీసెర్చర్, సీనియర్ సేల్స్ మేనేజర్, సర్వీస్ ఇంజినీర్‌గా వివిధ హోదాల్లో పనిచేయవ చ్చు. ఇవికాకుండా ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమో అర్హతలతో ఎగ్జిక్యూటివ్స్, ఇన్చార్జులుగా విధులు నిర్వర్తించొచ్చు. ఇతర విభాగాల గ్రాడ్యు యేట్స్ కూడా కస్టమర్ సర్వీస్, మార్కె టింగ్, కలెక్షన్, సేల్స్ విభాగాల్లో ఉద్యోగావకాశాలను దక్కించుకోవచ్చు. 2జీ, 3జీ, 4జీవంటి సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాపార కార్యకలాపాల్లో చోటుచేసుకుం టున్న నూతన మార్పులతో నిపుణుల అవసరం పెరిగింది. క్షేత్రస్థాయిలో సంబం ధిత కంపెనీ రిటైల్ ఔట్లెట్ మేనేజర్, మార్కెటింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ పని చేస్తుంటారు. వీరితోపాటు సెల్‌ఫోన్ రిపేరింగ్ టెక్నీషియన్స్, ఇతర ఉద్యోగులు కూడా ఉంటారు.

         కోర్సులు.. అర్హతలు

టెలికమ్యూనికేషన్ కోర్సులు చేయా లనుకుంటే ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) చేసి, బీటెక్ లో టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ కోర్సును చదవొచ్చు. బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్ అభ్యసించొచ్చు. జేఎన్టీయూ – హైదరాబాద్, జేఎన్టీ యూ- కాకినాడ ఎంటెక్‌లో టెలికమ్యూని కేషన్ సంబంధితకోర్సులను అందిస్తు న్నాయి. సేల్స్, మార్కెటింగ్, హెస్ఆర్ వంటి విభాగాలకు ఏదైనా గ్రాడ్యుయేషన్ కోర్సులు చేయాలి. తర్వాత ఎంబీఏ పూర్తి చేస్తే మంచి అవకాశాలు చేజిక్కించుకోవచ్చు. కొన్ని విద్యా సంస్థలు టెలికాం మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సు లు ఆఫర్ చేస్తున్నాయి.

నగరంలో టెలికాం స్కిల్స్ ప్రోగ్రామ్స్

నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ ఆధ్వర్యంలో టెలికాం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (టీఎస్ఎస్సీ) టెలికాం రంగానికి కావాల్సిన మానవ వనరులను అందిస్తోంది. ఇందుకోసం వివిధ స్వల్పకాలిక శిక్షణా కోర్సులను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నగరంలో సుమారు 15 శిక్షణా సంస్థలు న్నాయి. వీటిలో బీటెక్/ఎంటెక్/బీఎస్సీ/ ఎంబీఏ విద్యార్హతల ఉన్నవారికి అవకాశ ముంటుంది.

    శిక్షణా కేంద్రాల వివరాలు

స్కూల్ ఆఫ్ టెలికాం లీడర్షిప్: సర్టిఫైడ్ ఫైబర్ ఆప్టిక్స్ నెట్ వర్క్ ఇంజినీర్, సర్టిఫైడ్ ఆప్టికల్ ఫైబర్ స్పైసర్, సర్టిఫైడ్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్, సర్టిఫైడ్ టెలికాం వైర్లెస్ నెట్వర్క్ ఇంజినీర్, సర్టిఫైడ్ టెలికాం బీఎస్ఎస్ ఇంజినీర్, సర్టిఫైడ్ టెలికాం ట్రాన్స్ మిషన్ ఇంజినీర్ కోర్సులు అందిస్తోంది.

ఐ.ఎస్.టి.టి.ఎం టెక్నాలజీ బిజినెస్ స్కూల్ (మాదాపూర్): ఎంబీఏ టెలికాం అండ్ ఐటీ మేనేజ్మెంట్, వివిధ సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.

ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎసీసీఐ) (గచ్చిబౌలి): సీసీఈ కాల్ సెంటర్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, టవర్ టెక్నీషియన్, హ్యాండ్సెట్ రిపేర్ ఇంజినీర్(లెవల్-2), ఆప్టికల్ ఫైబర్ సైఫ్సర్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సులున్నాయి.

నేషనల్ అకాడమీ ఆఫ్ టెలికాం ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్(హైదరాబాద్): ఎంబీఏలో టెలికాం మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్స్టెలికాం టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ తదితర కోర్సులను అంది స్తోంది.

 ఉద్యోగాలు ఇస్తున్న సంస్థలివే.. 

టెలికాం రంగంలో మేనేజ్మెంట్/అడ్మినిస్ట్రేషన్, నెట్వర్క్, మార్కెటింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్‌కేర్ తదితర విభాగాలు కీలకం. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్), రక్షణ రంగం, టెలికాం డిపార్ట్మెంట్, భారతీయ రైల్వే, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), బిర్లాగ్రూప్, రిలయన్స్ తదితర సంస్థలు ఉద్యోగ నియామకాలకు ఖాళీలను బట్టి ప్రకట నలను విడుదల చేస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇంజినీర్ల నియామకానికి ప్రతి ఏటా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఇండి యన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)ను నిర్వహిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపికైన వారిని జూనియర్ టెలికాం ఆఫీసర్(జనరల్ సెంట్రల్ సర్వీస్ – గ్రూప్ బి), ఇండియన్ టెలికమ్యూనికేషన్ సర్వీస్- గ్రూప్-ఏ, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్ (ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్), ఇండియన్ సప్లై సర్వీస్, అసిస్టెంట్ నేవల్ స్టోర్ ఆఫీసర్స్, సెంట్రల్ పవర్ ఇంజినీరింగ్ సర్వీస్, అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఇండియన్ రైల్వే స్టోర్స్ సర్వీస్ వంటివాటిలో నియ మిస్తారు. సంబంధిత బ్రాంచిలో బీటెక్ ఉత్తీర్ణులు ఐఈఎస్‌కు అర్హులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *